News August 2, 2024
BREAKING: భారత్VSశ్రీలంక మ్యాచ్ టై

శ్రీలంక, భారత్ మధ్య జరిగిన తొలి వన్డే టై అయ్యింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక 230 పరుగులు చేయగా భారత్ కూడా అదే స్కోర్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(58) హాఫ్ సెంచరీతో రాణించారు. అక్షర్ పటేల్(33), కెఎల్.రాహుల్(31), శివం దూబే(25), కోహ్లీ(24), అయ్యర్(23) ఫరవాలేదనిపించారు. 47.5 ఓవర్లలో 230 రన్స్ చేసిన భారత్ ఆలౌటైంది. కాగా వన్డే క్రికెట్ చరిత్రలో ఇది 44వ టై మ్యాచ్.
Similar News
News March 21, 2026
అమెరికాకు ‘క్విడ్ ప్రోకో’ ప్రతిపాదన చేయలేదు: రష్యా

ఉక్రెయిన్‌కు మద్దతును అమెరికా ఉపసంహరించుకుంటే తాము ఇరాన్‌కు ఇంటెలిజెన్స్ సాయాన్ని నిలిపివేస్తామని రష్యా ఆఫర్ ఇచ్చినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. వీటిని రష్యా ఖండించింది. అమెరికాతో ఎలాంటి క్విడ్ ప్రోకో ప్రతిపాదన జరగలేదని, ఇవన్నీ ఫేక్ వార్తలని స్పష్టం చేసింది. పుతిన్ రాయబారి కిరిల్ దిమిత్రీవ్ ఈ ఐడియాను ప్రతిపాదించినట్లు నివేదికలు పేర్కొనగా, ఆయన దీనిని X వేదికగా ఖండించారు.
News March 21, 2026
ఆడియన్స్ సీట్లకు అతుక్కుపోయారు: రాజమౌళి

‘ధురంధర్-2’ 4 గంటల నిడివి ఉన్నా ఆడియన్స్ లాస్ట్ ఫ్రేమ్ వరకు సీట్లకు అతుక్కుపోయారని డైరెక్టర్ రాజమౌళి అన్నారు. ఇంతటి లెన్త్ ఉన్న మూవీని రిలీజ్ చేయడానికి గట్స్ ఉండాలని చెప్పారు. తనకు ధురంధర్ నచ్చిందని, ధురంధర్-2 అంతకంటే బాగుందని కొనియాడారు. రైటింగ్, కాస్టింగ్, మ్యూజిక్, డైరెక్షన్ ఇలా అన్ని విభాగాల్లో మూవీ అద్భుతంగా ఉందని ట్వీట్ చేశారు. రణ్‌వీర్, మాధవన్ నటనలో మాస్టర్ క్లాస్ చూపించారన్నారు.
News March 21, 2026
పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ సీజ్

TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. పార్టీకి ఉపయోగించిన ఫామ్‌హౌస్‌ను పోలీసులు సీజ్ చేశారు. అసైన్డ్ భూమిలో దాన్ని కట్టారని అధికారులు తేల్చగా, పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు పార్టీకి వచ్చినవారి వాహనాలనూ సీజ్ చేశారు.


