News August 2, 2024
బెదిరింపు కాల్స్ వస్తున్నాయని TDP నేత ఫిర్యాదు
తనకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు టీడీపీ నేత, ఆర్యవైశ్య నాయకులు సుబ్బారావు గుప్తా శుక్రవారం ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఇటీవల అవినీతిపరుల చిట్టాలను బహిర్గతం చేయడం వల్ల కొందరు తనను చంపుతామని బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బెదిరించిన వారెవరో గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తనకు రక్షణ కల్పించాలని కోరారు.
Similar News
News November 27, 2024
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించిన MLA తాటిపర్తి
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్విటర్(X) వేదికగా ప్రశ్నించారు. ‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై విష ప్రచారం చేసి, ఇప్పుడు మా హయాంలో జరిగిన రీ సర్వే ప్రాజెక్టు గొప్పతనాన్ని కేంద్ర ప్రభుత్వానికి వివరించి 500 కోట్ల రూపాయలు ప్రోత్సహకాలు తీసుకుంటుందని నిజం కాదా ?’ అని పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేశారు.
News November 27, 2024
ఒంగోలు తాలుకా పోలీస్ స్టేషన్లో వైద్య పరీక్షలు
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హత్యాయత్నం కేసు విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా నిన్న రాత్రి సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని తాలుకా పోలీస్ స్టేషన్లోనే ఆయనను రాత్రి నుంచి ఉంచారు. అక్కడే వైద్య పరీక్షలు చేసి ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించారు. గుంటూరులోని నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు ఉండటంతో మరికాసేపట్లో అక్కడికి తరలిస్తారని సమాచారం.
News November 26, 2024
అద్దంకి: 108 ఉద్యోగుల సమ్మె తాత్కాలిక వాయిదా
108 ఉద్యోగుల సమ్మె తాత్కాలికంగా పోస్ట్ పోన్ అయినట్లు 108 బాపట్ల జిల్లా కార్యదర్శి, అద్దంకి 108 EMT హరిబాబు మంగళవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. 108 సమస్యలపై 108 ప్రిన్సిపల్ సీఈవో 14 డిమాండ్లపై మినిట్స్ రూపంలో హామీ ఇచ్చినట్లు. ఈ సందర్భంగా ఆయన చెప్పారు. దీంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశామన్నారు.