News August 2, 2024

బాధితులకు RSS అండ

image

వయనాడ్(కేరళ) బాధితులకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) వాలంటీర్లు అండగా నిలుస్తున్నారు. ఘటనా స్థలంలోనే ఉంటూ రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంటున్నారు. ప్రభుత్వ సిబ్బందితో కలిసి అక్కడికి కొట్టుకొచ్చిన చెట్లు, రాళ్లు, బురదను తొలగిస్తున్నారు. సర్వస్వం కోల్పోయిన బాధితులకు నిత్యావసర సరుకులు అందిస్తున్నారు.

Similar News

News March 22, 2026

‘చచ్చాడు.. సంతోషం’: ట్రంప్ నోటి దురుసు!

image

అమెరికాలో FBI మాజీ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్ (81) కన్నుమూశారు. 9/11 దాడుల తర్వాత FBI రూపురేఖలు మార్చిన ఆయన ట్రంప్-రష్యా సంబంధాలపై ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ కక్షను మనసులో పెట్టుకున్న ట్రంప్.. ముల్లర్ చనిపోగానే ‘చచ్చాడు.. చాలా సంతోషం. ఇక అమాయకులను వేధించలేడు’ అని అన్నారు. ఒక లెజెండరీ ఆఫీసర్ అంటూ చాలా మంది సంతాపం తెలుపుతుంటే ట్రంప్ ఇలాంటి కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది.

News March 22, 2026

కుల మీటింగ్స్‌కు వెళ్తే తప్పేంటి?: హైడ్రా కమిషనర్

image

కుల సమావేశాల్లో పాల్గొనడంపై వస్తున్న విమర్శలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. ‘భారతదేశంలో కులాన్ని విడదీయలేం. మంచి విషయాల కోసమే వెళ్తున్నాను’ అని స్పష్టం చేశారు. తనకు పబ్లిసిటీ పిచ్చి లేదని కేవలం ప్రజల్లో అవగాహన కోసమే ఇంటర్వ్యూలు ఇస్తున్నానని చెప్పారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదన్నారు. 50 ఏళ్ల క్రితం నిర్మించిన తమ ఇంటికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయని తెలిపారు.

News March 22, 2026

మార్చి 22: చరిత్రలో ఈరోజు

image

1868: అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ మిల్లికాన్ జననం
2000: ఇన్సాట్-3బీ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది
2005: తమిళ నటుడు జెమినీ గణేశన్ మరణం
2009: సినీ నటుడు, నిర్మాత కాంతారావు మరణం (ఫొటోలో)
* ప్రపంచ జల దినోత్సవం