News August 3, 2024

NZB: ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఈ నెల 5 నుంచి 9 వరకు కొనసాగనున్న ‘స్వచ్ఛదనం – పచ్చదనం’ కార్యక్రమం నిర్వహణలో నిర్లక్ష్యానికి తావిస్తే, బాధ్యులపై కఠినచర్యలు తప్పవని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాల స్పెషల్ ఆఫీసర్లు, ఆర్డీఓలు, తాహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, జీపీ ప్రత్యేక అధికారులు, ఏపీఎంలు, పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడారు .

Similar News

News February 6, 2025

NZB: రైలులోంచి పడి యువకుడు మృతి

image

రైల్లోంచి పడి గుర్తుతెలియని యువకుడు మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. NZB- జానకంపేట రైల్వే స్టేషన్ మధ్యలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్లోంచి కింద పడడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712658591 నంబర్‌‌‌కు సంప్రదించాలన్నారు.

News February 6, 2025

జక్రాన్‌పల్లి: విలువైన నిషేదిత మత్తు పదార్థాల దహనం

image

నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 154 కేసులలో పట్టుబడిన రూ.12కోట్ల విలువైన నిషేదిత మత్తు పదార్థాలను జక్రాన్పల్లిలోని శ్రీ మెడికేర్‌లో గురువారం దహనం చేశారు. ఈ మేరకు డ్రగ్ డిస్పోజల్ కమిటీ అమోదించిన నిషేదిత మత్తు పదార్థాలైన 1700 కిలోల ఎండు గంజాయి, 64.27 కిలోల అల్ఫాజోలం, 72.2 కిలోల డైజీపాం, ఒక గంజాయి మొక్కను దహనం చేశారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. 

News February 6, 2025

NZB: ఉపాధ్యాయులకు డీఈవో నోటీసులు 

image

సమయానికి పాఠశాలకు హాజరు కాని నలుగురు ఉపాధ్యాయులకు డీఈవో అశోక్ షోకాజ్ నోటీసులను జారీ చేశారు. గురువారం నిజామాబాద్ వినాయకనగర్ ప్రాథమికోన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఆ సమయంలో టీచర్లు రాకపోవడంతో నోటీసులు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాఠశాల సమయానికి ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

error: Content is protected !!