News August 3, 2024
5 నుంచి స్వచ్ఛదనం-పచ్చదనం: కలెక్టర్

ఈనెల 5 నుండి 9 వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలలో నిర్వహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన NLG నుండి మండల స్థాయి అధికారులతో స్వచ్ఛదనం పచ్చదనం పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత, మొక్కలు నాటడం, తాగునీరు, వివిధ సంస్థల పరిశుభ్రత, వీధికుక్కల బెడద తగ్గించడం వంటి అంశాలను చేపట్టాలన్నారు.
Similar News
News October 30, 2025
NLG: పంట నష్టం.. క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన!

మొంథా తుపాన్ కారణంగా ఉమ్మడి జిల్లాలో నష్టపోయిన పంటల వివరాలను సేకరించేందుకు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతున్నారు. గ్రామాల్లో ఉన్న ఏఈఓల ద్వారా ఉన్నతాధికారులు వివరాలను సేకరిస్తున్నారు. ఏయే గ్రామాల్లో వంట ఎన్ని ఎకరాల్లో వరి పంట నేలకొరిగిందనే విషయాలను తెలుసుకుంటున్నారు. రైతుల వివరాలను, ఎన్ని ఎకరాల్లో నష్టపోయిందో రికార్డుల్లో నమోదు చేసుకుంటున్నారు.
News October 30, 2025
NLG: మోంథా ఎఫెక్ట్… రైళ్ల రద్దు

మోంథా తుపాన్ ప్రభావం రైళ్ల రాకపోకలపై పడింది. సికింద్రాబాద్ నుంచి NLG మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జన్మభూమి, విశాఖ, ఫలక్ నుమా రైళ్లు బుధవారం కొంత ఆలస్యంగా నడిచాయి. ఇవాళ ఉదయం రావాల్సిన పల్నాడు ఎక్స్ప్రెస్ రద్దయినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
News October 30, 2025
NLG: నిత్య పూజలకు నోచుకోని శివయ్య

శాలిగౌరారంలోని శివాలయంలో నిత్యపూజలు జరగకపోవడం పట్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్ గుండా దుర్గయ్య నల్గొండలోని ఎండోమెంట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఆలయ పూజారి రాంబాబు నిత్య పూజలు చేయడానికి రావడం లేదని ఫిర్యాదు చేశారు. నెల రోజుల క్రితం ఎండోమెంట్ ఈవో రుద్రారం వెంకటేశ్వర్లుకు నిత్య పూజ చేస్తానని పెద్దమనుషుల సమక్షంలో రాసిచ్చినప్పటికీ, ఆ తర్వాత కూడా పూజారి రావడం లేదన్నారు.


