News August 3, 2024
అనంతపురం: దేవాలయాల సందర్శనకు ప్రత్యేక బస్సులు

శ్రావణ మాసంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో దేవాలయాల సందర్శనకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి మధుసూదన్ పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి 31వరకు ప్రతి మంగళవారం, శనివారం జిల్లాలోని హిందూపురం, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుకొండ, మడకశిర డిపోల నుంచి మురడి, నేమకల్లు, కసాపురం మూడు ఆలయాలను కలుపుతూ ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Similar News
News November 11, 2025
వరల్డ్ కప్‌లో గుంతకల్లు యువకుడి ప్రతిభ

ఇటీవల భారత మహిళలు వన్డే ప్రపంచ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ ఉమెన్స్ టీంలో ఒక సభ్యుడిగా గుంతకల్లుకు చెందిన క్రాంతికుమార్ ఘనత సాధించాడు. క్రాంతి కుమార్ టీం ఫిట్నెస్ కోచ్, ఫిజియోథెరపిస్ట్‌గా టీమ్‌కు సేవలు అందించాడు. గుంతకల్లు పట్టణానికి చెందిన క్రీడాకారుడు ఉమెన్స్ టీం మెంబెర్‌గా ఉండటం గుంతకల్లు పట్టణానికి గర్వకారణం అని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News November 10, 2025
కుష్టు వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

అనంతపురం జిల్లాలో కుష్టు వ్యాధిపై ప్రజలకు ఉన్న అపోహలను తొలగించి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆనంద్ వైద్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో వైద్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 17 నుంచి 30 వరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇంటింటికి వెళ్లి కుష్టు వ్యాధిపై సర్వే చేపట్టాలన్నారు. వ్యాధి గ్రస్తులను గుర్తించి వైద్యం అందించాలన్నారు.
News November 10, 2025
స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై అర్జీదారుల నుంచి కలెక్టర్ ఆనంద్ అర్జీలను స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. సమస్యల పరిష్కారంపై నిరంతర సమీక్ష ఉంటుందని వివరించారు.


