News August 3, 2024
నెల్లూరు: అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేయాలి

రాష్ట్రాభివృద్ధికి అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి బి.సి జనార్ధన్ రెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి సమీక్ష జరిపారు. హాజరైన నెల్లూరు పార్లమెంట్ స్థాయి నేతలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులకు సూచించారు. సైకో పాలనలో ఐదేళ్లుగా రాష్ట్రం నిర్లక్ష్యానికి గురయ్యి అభివృద్ధి పడకేసిందన్నారు. తిరిగి రాష్ట్రాన్ని బాగు చేసుకుందామన్నారు.
Similar News
News March 18, 2026
దివ్యాంగులతో నెల్లూరు కలెక్టర్ ప్రయాణం

నెల్లూరు జిల్లాలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభమైంది. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్‌లో కలెక్టర్ హిమాన్షు శుక్లా, మేయర్ సుజాత, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి బస్సును ప్రారంభించారు. తర్వాత దివ్యాంగులతో కలిసి కొంత దూరం ప్రయాణం చేశారు.
News March 18, 2026
నెల్లూరు: ముగిసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు

ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు మంగళవారంతో ముగిసినట్లు RIO వరప్రసాద్ తెలిపారు. జిల్లాలో మొదటి సంవత్సరంలో 23,334 మంది విద్యార్థులకుగానూ 22,843 మంది హాజరయ్యారన్నారు. జిల్లాలో జరిగిన మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షల్లో ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా చర్యలు చేపట్టడం వల్ల ప్రశాంతంగా ముగిశాయన్నారు. నేడు ద్వితీయ సంవత్సరం ప్రధాన పరీక్షలు కూడా ముగియనున్నట్లు ఆయన తెలిపారు.
News March 18, 2026
నెల్లూరు: నిధుల గోల్‌మాల్.. ముగ్గురిపై వేటు

సామాజిక పింఛన్ల నగదు, మండల పరిషత్ సాధారణ నిధులను స్వాహా చేశారన్న ఆరోపణలపై MPDO, AO, జూనియర్ అసిస్టెంట్లను సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోట మండలంలో MPDOగా పనిచేసిన బ్రహ్మయ్య, AO కౌసల్య, జూనియర్ అసిస్టెంట్ అబూబకర్ సిద్ధిఖ్ పింఛన్లు, మండల పరిషత్‌లో దాదాపు రూ.53లక్షల వరకు నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలొచ్చాయి. విచారణ అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


