News August 3, 2024

2025 జూన్ నాటికి పోర్ట్ నిర్మాణం పూర్తి: మంత్రులు

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్ట్ నిర్మాణం 2025 జూన్ నాటికి పూర్తి చేస్తామని మంత్రులు బీసీ జనార్ధన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. కలెక్టర్ ఆనంద్, కందుకూరు సబ్ కలెక్టర్ జి.విద్యాధరి, ఎమ్మెల్యలు నాగేశ్వరరావు, కృష్ణారెడ్డితో కలిసి పోర్టు నిర్మాణ పనులను వారు పరిశీలించారు.

Similar News

News March 3, 2026

ప్రకాశం SP కార్యాలయానికి 80 అర్జీలు

image

ప్రకాశం జిల్లా SP కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. SP హర్షవర్ధన్ రాజు ప్రజల నుంచి వచ్చిన 80 వినతి పత్రాలను స్వీకరించారు. సంబంధిత PS అధికారులతో మాట్లాడి చట్టబద్ధంగా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడుతూ.. వారి సమస్యలు పరిశీలించి న్యాయం చేస్తానని భరోసా కల్పించారు. అధికంగా భూ, ఆర్థిక తగాదాలు, అత్తింటి వేధింపులు, ఉద్యోగ మోసాలు వంటివి వచ్చాయన్నారు.

News March 2, 2026

10th పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి: ప్రకాశం JC

image

ప్రకాశం జిల్లాలో ఈనె ల 16వ తేదీ నుంచి 10th పబ్లిక్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పటిష్టంగా పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి సోమవారం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి, విద్యార్థులకు తాగునీరు, రవాణా సౌకర్యాలు కల్పించాలన్నారు.

News March 2, 2026

FLASH టంగుటూరు: రైలు ఢీకొని మహిళ మృతి

image

టంగుటూరు రైల్వే స్టేషన్ ఉత్తరం వైపు గుర్తు తెలియని 50 ఏళ్ల మహిళను కేరళ ఎక్స్‌ప్రెస్ ఢీకొంది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మహిళ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, వివరాలు తెలిస్తే 924757632 నంబర్‌ను సంప్రదించాలని ఒంగోల్ RPF ఎస్‌ఐ శ్రీరాం తెలిపారు.