News August 3, 2024

జులైలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.125 కోట్లు

image

AP: తిరుమల శ్రీవారిని జులైలో 22.13 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని ఈవో శ్యామలరావు తెలిపారు. హుండీ ఆదాయం రూ.125 కోట్లు లభించిందన్నారు. అలాగే 1.04 కోట్ల లడ్డూలను విక్రయించామన్నారు. అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల పనులను సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఆగస్టు 15-17 మధ్య పవిత్రోత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు.

Similar News

News March 30, 2026

పెట్రోల్ బంకుల ద్వారా కిరోసిన్ పంపిణీ

image

యుద్ధం నేపథ్యంలో దేశంలో కిరోసిన్ వినియోగాన్ని అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. పెట్రోల్ బంకుల్లో తాత్కాలికంగా 60రోజుల పాటు దీన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి జిల్లాలో 2బంకులు 5వేల లీటర్ల కిరోసిన్‌ను నిల్వ చేసుకునేలా నిబంధనలు సడలించింది. అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ(PDS) ద్వారా కిరోసిన్ సప్లై చేయనుంది. PNG కోసం శనివారం 6వేల మంది స్వచ్ఛందంగా LPG కనెక్షన్లు వదులుకున్నట్లు కేంద్రం తెలిపింది.

News March 30, 2026

హార్ముజ్‌లో ‘ఆపరేషన్ ఊర్జా సురక్ష’

image

హార్ముజ్ జలసంధి నుంచి భారతీయ నౌకలను సేఫ్‌గా తీసుకొచ్చేందుకు నేవీ ‘ఆపరేషన్ ఊర్జా సురక్ష’ చేపడుతోంది. ఇందులో భాగంగా ఆ ప్రాంతంలో నాలుగు నుంచి ఐదు యుద్ధనౌకలను నేవీ రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. భారతీయ మర్చంట్ నౌకలు.. ముఖ్యంగా చమురు వంటి కీలక వనరులు ఉన్న షిప్పులను దాటించేందుకు వీటిని ఉపయోగించనున్నారు. ఒమన్ గల్ఫ్ వద్ద ప్రస్తుతం ఇవి ఆపరేట్ అవుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

News March 30, 2026

ఈవీలపై ప్రభుత్వ ఉద్యోగులకు 20% వరకు డిస్కౌంట్!

image

TG: ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీలపై 10-20% రాయితీ ఇచ్చేందుకు సంస్థలు ముందుకొచ్చాయి. టాటాలో కర్వ్ ఈవీ మోడల్స్‌పై ₹3.4L-4L, పంచ్‌లో ₹2.75L-2.80L వరకు తగ్గింపు లభించనుంది. మహీంద్రాలో XUV-400 EL ప్రోపై ₹3.49లక్షల డిస్కౌంట్‌కు సంస్థ అంగీకరించింది. ఇతర ఈవీలపైనా ₹1.20L-2.65L మధ్య తగ్గనున్నాయి. టూవీలర్లలో ఓలా 20%, ఎథర్ 11% డిస్కౌంట్ ఆఫర్ చేశాయి. అయితే నెలకు కొన్ని వాహనాలు మాత్రమే అందిస్తామని తెలిపాయి.