News August 3, 2024
భవనాల సామర్థ్యంపై ఇప్పుడే చెప్పలేం: ఐఐటీ బృందం
AP: అమరావతిలో టీడీపీ తొలి సర్కారు ప్రారంభించిన భవనాల నిర్మాణం వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత నిలిచిపోయిన సంగతి తెలిసిందే. IIT-H నిపుణులు తాజాగా వాటిని పరిశీలించారు. భవన పటిష్ఠతలో కీలకమైన ఇనుప చువ్వలు తీవ్రంగా తుప్పుపట్టాయని తెలిపారు. వాటిని తొలగించిన లేదా శుభ్రం చేసిన తర్వాతే భవనాల సామర్థ్యంపై ఓ అంచనాకు రాగలమన్నారు. సమగ్ర అధ్యయనం చేసి త్వరలోనే నివేదిక సమర్పిస్తామని స్పష్టం చేశారు.
Similar News
News February 3, 2025
అలాగైతే.. పులివెందులకు ఉపఎన్నిక: RRR
AP: MLA ఎవరైనా లీవ్ అడగకుండా 60 రోజులు అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు పడుతుందని Dy. స్పీకర్ రఘురామకృష్ణరాజు(RRR) హెచ్చరించారు. ఒకవేళ మాజీ CM జగన్ అసెంబ్లీకి రాకపోతే పులివెందులకు ఉపఎన్నిక వస్తుందని చెప్పారు. ఆయన అసెంబ్లీకి వచ్చి తన మనోభావాలు పంచుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష హోదాను స్పీకర్, CM కాదు ప్రజలు ఇవ్వాలని తెలిపారు. తన కస్టోడియల్ కేసులో సునీల్ కుమార్ పాత్ర స్పష్టమైందన్నారు.
News February 3, 2025
మరోసారి థియేటర్లలోకి క్లాసిక్ సూపర్ హిట్
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ మూవీ అయిన ‘గోదావరి’ మరోసారి థియేటర్లలో విడుదల కానుంది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ క్లాసిక్ మూవీ మార్చి 1న రీరిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సుమంత్, కమలిని ముఖర్జీ జంటగా నటించగా.. ఇందులోని పాటలు ఇప్పటికీ ఎంతో మందికి ఫేవరెట్. మూవీలోని ‘సీతా మహాలక్ష్మి’ పాత్రకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరి ‘గోదావరి’ చూసేందుకు థియేటర్లకు వెళ్తున్నారా? లేదా? కామెంట్ చేయండి.
News February 3, 2025
17% పెరిగిన జీఎస్టీ ఆదాయం
తెలంగాణలో జీఎస్టీ, వ్యాట్ రాబడులు పెరిగాయి. జనవరిలో ఏకంగా 17 శాతం జీఎస్టీ ఆదాయం పెరిగింది. 2024 జనవరిలో రూ.3351.88 కోట్ల జీఎస్టీ వసూలు కాగా, ఈ ఏడాది JANలో రూ.3921.68 కోట్లు వచ్చాయి. గత 10 నెలల్లో జీఎస్టీ, వ్యాట్ కింద రూ.62858.55 కోట్లు వసూలు అయ్యాయి.