News August 3, 2024
స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: ఆమ్రపాలి

ఈనెల 5 నుంచి 9 వరకు నిర్వహించనున్న ‘స్వచ్ఛదనం- పచ్చదనం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బల్దియా కమిషనర్ ఆమ్రపాలి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పారిశుధ్యం, పచ్చదనాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణపై కమిషనర్ శుక్రవారం జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
Similar News
News March 8, 2026
సిటీ స్కైలైన్’ పిక్నిక్: ఫ్లైఓవర్ల కింద ఫాస్ట్ ఫుడ్!

నగరంలోని కొత్త ఫ్లైఓవర్ల కింద ఇప్పుడు వింతైన ‘డిన్నర్’ పార్టీలు జరుగుతున్నాయి. ఖరీదైన హోటళ్లకు వెళ్లే బదులు, బయోడైవర్సిటీ, షేక్‌పేట్ ఫ్లైఓవర్ల కింద బైకులు ఆపి, రోడ్డు పక్కన దొరికే బండి మీద తిండి తింటూ గంటల తరబడి కబుర్లు చెప్పుకుంటున్నారు. ట్రాఫిక్ వెలుగుల మధ్య, వాహనాల హడావుడిని చూస్తూ గడపడమే ఒక ‘అర్బన్ అడ్వెంచర్’ అని వీరు భావిస్తున్నారు. ఈ ‘స్ట్రీట్ సైడ్’ లైఫ్ స్టైల్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.
News March 8, 2026
HYD: ‘కార్యేషు దాసి’.. ‘అర్ధాంగి’కి నిలువెత్తు రూపాలు..!

ఆ అన్నదమ్ములను విధి పక్షవాతం రూపంలో వెంటాడింది. ఘట్‌కేసర్ అంకుషాపూర్‌కు చెందిన బత్తుల కిష్టమ్మ కుమారులు భిక్షపతి(51), శ్రీరాములు(43) 16 ఏళ్లుగా పక్షవాతంతో పోరాడుతూ మంచానికే పరిమితయ్యారు. కాగా, వీరి భార్యలు భవానీ, సంధ్య భర్తలకు కన్నతల్లిలా సేవలు చేసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ‘కార్యేషు దాసి’ అన్న ఆర్యోక్తిని వీరు నిజం చేసి చూపిస్తున్నారు. అర్ధాంగులు అన్న అర్థానికి జీవం పోస్తున్నారు.
News March 8, 2026
HYD: ఆడవాళ్లు మీకు జోహార్లు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అన్ని రంగాల్లోని విజయాలు స్ఫూర్తినిస్తున్నాయి. ఐటీ, అంతరిక్ష పరిశోధనల నుంచి స్టార్టప్‌ల వరకు హైదరాబాద్ మహిళలు ప్రపంచస్థాయి గుర్తింపు పొందుతున్నారు. మహిళలు లఖ్‌పతీ దీదీలుగా ఎదిగి ఆర్థిక సాధికారతను చాటుతున్నారు. క్రీడల్లో మెడల్స్ సాధించి దేశ ప్రతిష్టను పెంచారు. పాలనలోనూ కలెక్టర్లు, డీసీపీలుగా శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ మహిళా శక్తిని నిరూపిస్తున్నారు.


