News August 3, 2024
కడప: కరెంట్ షాక్‌తో.. బాలుడు మృతి

ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ షాక్ కొట్టి మూడేళ్ల బాలుడు చనిపోయిన విషాద ఘటన పుల్లంపేట మండలం దలవాయిపల్లెలో చోటు చేసుకుంది. బిందుప్రియకు మూడేళ్ల కుమారుడు జాన్ వెస్లిన్ ఉన్నాడు. తల్లి శుక్రవారం వేడినీటి కోసం బాత్రూంలోని బకెట్‌లో వాటర్ హీటర్‌ను ఉంచి ఆన్ చేసింది. తల్లి ఇంట్లో పని చేసుకుంటుండగా ఆడుకుంటూ అటువైపుగా వెళ్లిన బాలుడు దానిని తాకాడు. దీంతో విద్యుత్ షాక్‌కు గురై చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News March 16, 2026
కడప: పదో తరగతి ఎగ్జాం రూములోకి పాము

కడప జిల్లా బి.కోడూరులో పదో తరగతి పరీక్షలు సోమవారం మొదలయ్యాయి. స్థానికంగా ఉన్న ఓ పరీక్షా కేంద్రంలోని రూములోకి పాము వచ్చింది. విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. స్కూల్ సిబ్బంది పామును చంపి బయట వేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులు వెళ్లారు.
News March 16, 2026
సిద్ధవటం: ప్రారంభమైన పది పరీక్షలు

మండల కేంద్రమైన సిద్ధవటం జిల్లా పరిషత్ హైస్కూల్లో పదో తరగతి పరీక్షల సందర్భంగా సిద్ధవటం మండల ఎస్సై హారిక ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థుల హాల్ టికెట్లు చెక్ చేసి లోపలికి అనుమతించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఏఎస్ఐ సుబ్బరామచంద్ర, కొండయ్య, కానిస్టేబుల్ రాఘవ బందోబస్తులో పాల్గొన్నారు.
News March 16, 2026
నేటి ‘రైతన్నా మీకోసం వారోత్సవాలు’: కడప కలెక్టర్

సోమవారం నుంచి 25వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ‘రైతన్నా మీకోసం వారోత్సవాలు’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి, రైతుల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. ఖరీఫ్ సాగు పద్ధతులపై అవగాహన, పంటల ప్రణాళిక, ఆధునిక సాంకేతికతపై అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు.


