News August 3, 2024
శ్రీకాకుళం: ఐటిఐ చేసిన విద్యార్థులకు గుడ్ న్యూస్

ఉత్తరాంధ్రలో ఐటీఐ చేసిన విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ అదిరే శుభవార్త చెప్పింది. డీజిల్ మెకానిక్, మోటార్ వెహికల్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, పెయింటింగ్, ఫిట్టర్, డ్రాప్ట్మన్(సివిల్) చేసిన ఐటీఐ విద్యార్థులకు అప్రెంటిస్షిప్ కల్పిస్తోంది. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని విజయనగరం జోనల్ స్టాప్ ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపల్ తెలిపారు. https://apprenticeshipindia.gov.in దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News March 3, 2026
సిక్కోలు: మరి కాసేపట్లో క్లోజ్

శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ దేవాలయాలు కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా మంగళవారం మూతపడుతున్నాయి. ఈ విషయాన్ని ఆయా ఆలయాల ప్రధాన అర్చకులు తెలిపారు. చంద్రగ్రహణం నేపథ్యంలో మూత పడుతున్న ప్రముఖ దేవాలయాల జాబితాలో అరసవల్లి సూర్య దేవాలయం, శ్రీకూర్మనాథ ఆలయం, నారాయణ తిరుమల, ఉమారుద్ర కోటేశ్వర ఆలయం, శ్రీముఖలింగం తదితర దేవాలయాలు ఉన్నాయి. గ్రహణ త్యాగం అనంతరం ఆలయ సంప్రోక్షణ, భక్తులకు దర్శనాలు ఉంటాయన్నారు.
News March 3, 2026
బాణసంచా పేలి 21 మంది మృతి.. శ్రీకాకుళం కలెక్టర్ సీరియస్

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. జిల్లాలో బాణసంచా తయారీ నిల్వ విక్రయ కేంద్రాల వద్ద అగ్నిప్రమాద నివారణ చర్యలను అత్యంత కట్టుదిట్టం చేయాలన్నారు. కాకినాడ జిల్లా వేట్లపాలెం వద్ద పేలుడుతో 21 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.
News March 3, 2026
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు- కలెక్టర్