News August 3, 2024

సీఎం రేవంత్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు

image

TG: సీఎం రేవంత్ రెడ్డిపై రెండు అంశాల మీద అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కు బీఆర్ఎస్ శాసనసభా పక్షం సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు అందించింది. విద్యుత్ మీటర్లపై సభను తప్పుదోవ పట్టించారని, మహిళా ఎమ్మెల్యేలను అవమానించేలా మాట్లాడారని పేర్కొంది. ఈ అంశాలపై సీఎంపై చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే పార్టీ మారిన ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.

Similar News

News March 31, 2026

ప్రభాస్ బిజీబిజీ.. ఈ ఏడాదే ‘ఫౌజీ’?

image

‘రాజాసాబ్’ డ్యామేజ్ నుంచి బయటపడేందుకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన నెక్స్ట్ సినిమా ‘ఫౌజీ’పై ఎక్కువ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. దీనిని ఈ ఏడాదే రిలీజ్ చేసేలా షూటింగ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. దీంతోపాటు ‘కల్కి-2’, ‘స్పిరిట్’ సినిమాల షూటింగ్స్‌లోనూ పాల్గొంటూ ఆయన బిజీగా ఉంటున్నట్లు సినీవర్గాలు తెలిపాయి.

News March 31, 2026

పెళ్లికి ముందు ఈ టెస్టులు చేయించుకోండి!

image

పెళ్లికి జాతకాలతో పాటు మెడికల్ టెస్టులు చేయించుకోవడం కూడా ఎంతో ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. ‘బ్లడ్ గ్రూప్, హిమోగ్లోబిన్ స్థాయులు, HIV, హెపటైటిస్-B &C, VDRL, రుబెల్లా వంటి పరీక్షలు కాబోయే జంటలు చేయించుకోవాలి. ఇవి దంపతుల ఆరోగ్యానికే కాకుండా, పుట్టబోయే బిడ్డలకు జన్యుపరమైన లోపాలు, ప్రాణాంతక వ్యాధులు రాకుండా రక్షణనిస్తాయి’ అని చెబుతున్నారు. SHARE IT

News March 31, 2026

బాలామృతమా… బాలల పాలిట విషమా!

image

TG: అంగన్వాడీ సెంటర్లలో అందిస్తున్న పాలపొడి, ఇతర పదార్థాలు విషతుల్యంగా మారుతున్నాయి. కాలంచెల్లిన సరకుకు కొత్త లేబుల్స్ అంటించి కాంట్రాక్టర్లు అందిస్తున్నారు. వీటిలో ఫంగస్, బాక్టీరియా ఉన్నట్లు స్టేట్ ఫుడ్ ల్యాబ్ రిపోర్ట్ తేల్చింది. కమీషన్ల మత్తులో అధికారులు చర్యలకు బదులు హెచ్చరికలతో సరిపెడుతున్నారు. 35700కు పైగా అంగన్వాడీ కేంద్రాలుండగా వీటిలో పోషకాహారానికి FY25-26లో GOVT ₹156 CR ఇచ్చింది.