News August 3, 2024

Olympics: 20 ఏళ్లలో తొలిసారి.. 60 ఏళ్లలో మరోసారి

image

ఒలింపిక్స్‌లో సత్తా చాటాలనే కోరిక ఉండాలేగానీ వయసుతో సంబంధం లేదని నిరూపించారో షూటర్. వెనిజులాకు చెందిన లియోనల్ మార్టినెజ్ 20ఏళ్ల కుర్రాడిగా 1984 ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. తర్వాత ఆటకు దూరమయ్యారు. 40 ఏళ్ల తర్వాత అతనికి మళ్లీ ఆటపై మనసు మళ్లింది. గతేడాది పాన్ అమెరికన్ క్రీడల్లో రజతం సాధించి ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. 60 ఏళ్ల వయసులో ట్రాప్ ఈవెంట్‌లో పాల్గొని 28వ స్థానంలో నిలిచారు.
<<-se>>#Olympics2024<<>>

Similar News

News March 16, 2026

హార్ముజ్‌పై ఆశలు.. మార్కెట్లకు లాభాల జోష్

image

గత మూడు సెషన్లలో భారీ నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లకు ఈరోజు భారీ లాభాలు ఊరటనిచ్చాయి. సెన్సెక్స్ 938 పాయింట్ల లాభంతో 75,502 వద్ద క్లోజ్ అవగా నిఫ్టీ 257 పాయింట్ల లాభంతో 23,408 వద్ద స్థిరపడింది. కొనుగోళ్లు పెరగడం, క్రూడ్ లోడ్‌తో భారతీయ నౌకలు వస్తుండటం, హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న ఇతర నౌకలను ఎస్కార్ట్ చేసేందుకు US ప్లాన్ చేస్తున్నట్లు రిపోర్ట్స్ రావడం మార్కెట్లకు రిలీఫ్‌ను ఇచ్చింది.

News March 16, 2026

వరుస సెలవులు.. ప్రత్యేక బస్సులు

image

ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో పలు కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులు సొంతూళ్లకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. గురువారం ఉగాది, శనివారం రంజాన్ సెలవు దినాలు కావడంతో.. శుక్రవారం ఒక్కరోజు లీవ్ పెడితే ఆదివారంతో కలిపి వరుసగా 4 రోజులు సెలవులు రానున్నాయి. ఇక పండుగ రద్దీ దృష్ట్యా 17, 18వ తేదీల్లో TGSRTC ప్రత్యేక బస్సులు(స్పెషల్ ఛార్జీలు వర్తిస్తాయి) నడపనున్నట్లు ప్రకటించింది.

News March 16, 2026

‘పద్మ వ్యూహం’ నిర్మాణం ఎలా ఉంటుందంటే?

image

బయటపడలేని సమస్యల్లో ఉన్నప్పుడు ‘పద్మవ్యూహం’లో ఇరుక్కుపోయారని అంటారు. భారతంలో ద్రోణాచార్యుడు పన్నిన శత్రు దుర్భేద్యమైన యుద్ధ నిర్మాణమే పద్మవ్యూహం. తామరపువ్వు ఆకారంలో 7 వలయాల్లో రథ, గజ, అశ్వ, పదాతి సైన్యాలతో ఉంటుంది. ఇందులోకి వెళ్లిన అభిమన్యుడు తనువు చాలించారు. దీన్ని ఛేదించగలిగేది కృష్ణుడు, ప్రద్యుమ్నుడు, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, అర్జునుడు మాత్రమే.
<<-se>>#EPICSAYINGS<<>>