News August 3, 2024
గ్రహాంతరవాసికి గుడి కట్టి పూజలు
దేవుళ్లకు గుడి కట్టడం సహజం. ఇటీవల అభిమాన నటీనటులు, పేరెంట్స్, భార్య, పిల్లల జ్ఞాపకార్థమూ ఆలయాలు కడుతున్నారు. అయితే తమిళనాడులోని సేలంలో సిద్ధర్ అనే వ్యక్తి అగస్త్య మహర్షితో పాటు ఏలియన్‌కు గుడి కట్టి పూజలు చేస్తున్నారు. శివుడు ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత గ్రహాంతరవాసులు పుట్టారని, ఈ విషయాన్ని అగస్త్యుడు గ్రంథాలలో రాశారని అతను చెబుతున్నారు. అందుకే విగ్రహం ప్రతిష్ఠించి పూజిస్తున్నానని తెలిపారు.
Similar News
News February 3, 2025
మరోసారి థియేటర్లలోకి క్లాసిక్ సూపర్ హిట్
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ మూవీ అయిన ‘గోదావరి’ మరోసారి థియేటర్లలో విడుదల కానుంది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ క్లాసిక్ మూవీ మార్చి 1న రీరిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సుమంత్, కమలిని ముఖర్జీ జంటగా నటించగా.. ఇందులోని పాటలు ఇప్పటికీ ఎంతో మందికి ఫేవరెట్. మూవీలోని ‘సీతా మహాలక్ష్మి’ పాత్రకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరి ‘గోదావరి’ చూసేందుకు థియేటర్లకు వెళ్తున్నారా? లేదా? కామెంట్ చేయండి.
News February 3, 2025
17% పెరిగిన జీఎస్టీ ఆదాయం
తెలంగాణలో జీఎస్టీ, వ్యాట్ రాబడులు పెరిగాయి. జనవరిలో ఏకంగా 17 శాతం జీఎస్టీ ఆదాయం పెరిగింది. 2024 జనవరిలో రూ.3351.88 కోట్ల జీఎస్టీ వసూలు కాగా, ఈ ఏడాది JANలో రూ.3921.68 కోట్లు వచ్చాయి. గత 10 నెలల్లో జీఎస్టీ, వ్యాట్ కింద రూ.62858.55 కోట్లు వసూలు అయ్యాయి.
News February 3, 2025
APకి రూ.9,417కోట్లు, TGకు రూ.5,337 కోట్లు: అశ్వినీ వైష్ణవ్
రైల్వే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాల కేటాయింపులపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. ‘తెలంగాణకు రూ.5,337cr, APకి రికార్డు స్థాయిలో రూ.9,417cr కేటాయించాం. తెలంగాణ వ్యాప్తంగా 1,326KM కవచ్ టెక్నాలజీ పని చేస్తోంది. APకి UPA హయాంలో కంటే 11రెట్లు ఎక్కువ కేటాయించాం. APలో 73రైల్వేస్టేషన్ల అభివృద్ధికి నిధులిచ్చి రూపురేఖలు మారుస్తున్నాం. రూ.8,455cr విలువైన రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేశాం’ అని అన్నారు.