News August 3, 2024
చిత్తూరు : వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

చిత్తూరు జిల్లాలోని డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (DCPU) నందు -9 పోస్టులు, మిషన్ శక్తి ప్రాజెక్టు కింద -9 పోస్టులు, ICDS – నందు 8 మొత్తం 26 కాంట్రాక్ట్ ప్రాతిపదికగా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత ఇతర వివరాలకు https://chittoor.ap.gov.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 10.
Similar News
News March 20, 2026
బంగారుపాళ్యం: హైవేపై ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన బంగారుపాళ్యంలో జరిగింది. పాపానివారి పల్లె కోళ్ల ఫారంలో బిహార్‌కు చెందిన లితీశ్ కుమార్ పనిచేస్తున్నాడు. కోళ్ల ఫారం యజమాని ప్రభుతో కలిసి బైకుపై కేజీ సత్రానికి బయలుదేరారు. వీరి వాహనాన్ని మరో బైక్ ఢీకొనడంతో లితీశ్ కుమార్ జాతీయ రహదారిపై పడ్డాడు. అటువైపు వెళుతున్న ట్యాంకర్ అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
News March 20, 2026
చిత్తూరు జిల్లాలో వర్షపాత వివరాలు..!

అల్పపీడన ద్రోణి ప్రభావ కారణంగా గడచిన 24 గంటల్లో వి.కోట, గుడుపల్లె మినహా మిగిలిన 26 మండలాల్లో వర్షం కురిసింది. గంగవరంలో 39.4 mm, పలమనేరులో 37.8 mm వర్షపాతం నమోదైంది. మండలాలు వారీగా.. యాదమరిలో 28.0, పూతలపట్టు, రొంపిచెర్ల మండలాల్లో 24.2, పెనుమూరులో 23.2, వెదురుకుప్పంలో 22.2, బైరెడ్డిపల్లిలో 17.2, గుడిపాలలో 12.4, పాలసముద్రం, విజయపురం మండలాల్లో 12.2, చిత్తూరు రూరల్ లో 10.6 mm వర్షపాతం నమోదు అయింది.
News March 19, 2026
చిత్తూరు కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు

చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ప్రజలకు ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నూతన సంవత్సరంలో అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని ఉగాది పచ్చడిని స్వీకరించారు.


