News August 3, 2024
ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బేల(M) సాంగిడికి చెందిన ప్రీతమ్(27) భిక్కనూరు(M) TU పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం కళాశాలలో వీడ్కోలు సమావేశం ఉండడంతో పనుల నిమిత్తం శుక్రవారం బయటికి వెళ్లాడు. బస్టాండ్ ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొట్టడంతో ప్రీతమ్ అక్కడికక్కడే చనిపోయాడు.
Similar News
News March 26, 2026
ADB: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

జిల్లాలో రోడ్డు ప్రమాదాల అడ్డుకట్టకు పోలీసులు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా వాహనదారుల రక్షణ కోసం స్పీడ్ బ్రేకర్లకు రాత్రి వేళల్లో స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ పెయింటింగ్ వేయించారు. ప్రతి ప్రాణం విలువైనదని, వాహనదారులు విధిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. భద్రతా చర్యలు చేపడుతున్న పోలీసుల పనితీరును ప్రజలు అభినందిస్తున్నారు.
News March 26, 2026
ADB: 17 బాల్యవివాహాలు నిలిపివేత

ఆదిలాబాద్ జిల్లాలో పోలీస్ అక్క కార్యక్రమం ప్రజల విశేష ఆదరణ పొందుతోంది. గత నెలలో 60 గ్రామాల్లో 131 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 45 పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు భద్రతపై అవగాహన కల్పించారు. మొత్తం 25 ఫిర్యాదులు స్వీకరించి వేధింపులపై చర్యలు తీసుకున్నారు. చిన్నారుల సమాచారంతో 17 బాల్యవివాహాలు నిలిపివేశారు. ఉత్తమ సిబ్బందిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు.
News March 26, 2026
ADB: పదికి 4 , ఇంటర్‌కు 3 పరీక్ష కేంద్రాలు

ఓపెన్ స్కూల్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, అందులో పదో తరగతికి 4, ఇంటర్‌కు 3 కేంద్రాలు కేటాయించినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రతి కేంద్రంలో సీసీటీవీ కెమెరాల నిఘా ఉండాలని, తాగునీరు, వెలుతురు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని అన్నారు. పరీక్షా పత్రాల రవాణా, భద్రతకోసం పోలీస్ శాఖతో సమన్వయం చేసుకోవాలని, విద్యార్థుల కోసం ఉదయం 7 నుండే బస్సులు నడపాలన్నారు.


