News August 3, 2024

20 రోజుల్లో 13 మంది పిల్లలు మృతి

image

ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆశాకిరణ్ వసతి గృహంలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. 20 రోజుల్లోనే 13 మంది దివ్యాంగ పిల్లలు చనిపోయారు. ఈ ఏడాది జనవరి నుంచి 27 మంది మరణించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో మంత్రి అతిశీ స్పందించారు. ‘దేశ రాజధానిలో ఇలాంటి ఘటన షాకింగ్‌గా ఉంది. ఇది తీవ్రమైన సమస్య. ఈ అంశంపై విచారణ చేపట్టి 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలి’ అని అధికారులను ఆదేశించారు.

Similar News

News March 31, 2026

జనగణన: మే1 నుంచి ఏపీలో, 16 నుంచి TGలో

image

జనగణన ప్రక్రియ AP, TGలో మే నుంచి ఆరంభం కానుంది. ముందుగా ఇళ్ల సర్వే ఏపీలో మే 1-30 వరకు, TGలో మే11-JUN9 వరకు ఉంటుంది. ఇక సెల్ఫ్ ఎన్యూమరేషన్ APలో మే16-30 తేదీల్లో, TGలో APR 26-మే10 తేదీ మధ్య జరుగుతుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్లో ప్రజలు ఇళ్ల సమాచారాన్ని సెన్సస్ వెబ్‌సైట్లో నమోదు చేయొచ్చు. ఇళ్ల సర్వేలో 34 ప్రశ్నలు అడుగుతారు. సెన్సెస్ రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ ఇవాళ మీడియా భేటీలో వీటిని వెల్లడించారు.

News March 31, 2026

రేపటి నుంచి ఇంటర్ క్లాసులు

image

AP: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రేపటి నుంచి ఇంటర్ సెకండియర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఉ.8 నుంచి మ.12:30 వరకు బోధన ఉంటుంది. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులను ఇంటికి పంపుతారు. ఏప్రిల్ 23 వరకు తరగతులు కొనసాగుతాయి. ఆ తర్వాత వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 1 నుంచి కాలేజీలు పున:ప్రారంభమవుతాయి. కాగా ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్, ఎగ్జామ్స్ జరిగిన విషయం తెలిసిందే.

News March 31, 2026

ఏప్రిల్ 2న ‘రామాయణ’ పాత్రల ఫస్ట్ లుక్?

image

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘రామాయణ’లోని పాత్రల ఫస్ట్ లుక్‌ను ఏప్రిల్ 2న మూవీ టీమ్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. హనుమాన్ జయంతి సందర్భంగా పాత్రల లుక్స్‌పై స్పెషల్ గ్లింప్స్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీడియోల్ నటిస్తున్నారు. రామాయణ తొలి భాగాన్ని ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.