News August 3, 2024

యూజీసీ నెట్ పరీక్ష కొత్త షెడ్యూల్ విడుదల

image

సబ్జెక్టుల వారీగా UGC NET పరీక్షల <>షెడ్యూల్‌ను<<>> NTA విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి SEP 4 మధ్య CBT విధానంలో ఎగ్జామ్స్ జరగనున్నాయి. జూనియర్‌ రీసెర్చ్ ఫెలోషిప్‌, వర్సిటీల్లో ASST.ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు, Phd కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా 2 సార్లు UGC NET నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్‌లో జరిగిన పరీక్షల్లో అవకతవకలు జరగడంతో రద్దు చేసింది.
వెబ్‌సైట్: https://ugcnet.nta.ac.in/

Similar News

News March 18, 2026

ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులు ఎప్పుడంటే?

image

AP: 2026-27 ఇంటర్ అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. సెకండియర్ విద్యార్థులకు ఏప్రిల్ 1న కాలేజీలు రీఓపెన్ కానున్నాయి. ఆ రోజు నుంచి 23వ తేదీ వరకు క్లాసులు నిర్వహిస్తారు. ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 1న ఫస్టియర్, సెకండియర్ క్లాసులు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 10 నుంచి 20 వరకు దసరా, 2027 JAN 9-17 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి.

News March 18, 2026

గ్రూప్-2లో పోస్టుల సంఖ్యను పెంచాలి: చిరంజీవి

image

AP: గ్రూప్-2 నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య పెంచాలని MLC వేపాడ చిరంజీవి సీఎస్ సాయిప్రసాద్‌ను కోరారు. నిరుద్యోగుల సమస్యలపై CSకు వినతిపత్రం సమర్పించారు. గ్రూప్-2లో డిప్యూటీ తహశీల్దార్ పోస్టులు చేర్చాలని, జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్యను పెంచాలని కోరారు. అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా జాబ్ క్యాలెండర్‌లో దాదాపు 600 గ్రూప్-1, 2 పోస్టులు ఉంటాయని సమాచారం.

News March 18, 2026

ఈ గ్రామంలో ఉన్నట్టుండి నిద్రపోతారు!

image

కజకిస్థాన్‌లోని కలాచి అనే గ్రామంలో ప్రజలు ఎప్పుడు, ఎలా నిద్రపోతారో ఎవరికీ తెలియదు. నడుస్తున్నా, మాట్లాడుతున్నా సరే ఒక్కసారిగా గాఢ నిద్రలోకి జారుకుంటారు. ఎవరూ లేపకపోతే రోజుల తరబడి పడుకుండిపోతారు. అందుకే దీనిని ‘స్లీపీ హలో’ అని పిలుస్తారు. సమీపంలోని పాత యురేనియం గనుల నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ వల్ల ఈ వ్యాధి వచ్చిందని భావిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో