News August 3, 2024
హనియే హత్య వెనుక ఇరాన్ ఏజెంట్లు

హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య వెనుక ఇరాన్ ఏజెంట్ల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘మొస్సాద్’ ముందే కొంతమందిని తమ ప్లాన్‌లో చేర్చుకుంది. వారి ద్వారా టెహ్రాన్‌లోని హనియే బస చేసే గెస్ట్ హౌస్‌లోని బెడ్ రూమ్‌లో బాంబు అమర్చింది. ఆయన అక్కడకు వెళ్లిన మరుక్షణంలోనే దానిని పేల్చివేసింది. కాగా ఇరాన్ మాజీ అధ్యక్షుడు రైసీ అంత్యక్రియల్లోనే హనియేను చంపేందుకు ప్లాన్ చేసి విఫలమైంది.
Similar News
News March 6, 2026
కర్ణాటకలో మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 16 ఏళ్లలోపు మైనర్లకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్లు సీఎం సిద్దరామయ్య అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. పిల్లలు, టీనేజర్లపై SM దుష్ప్రభావం చూపుతుందనే కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియాలో మైనర్లకు SMపై నిషేధం ఉండగా ఫిన్‌ల్యాండ్, UK కూడా అమలుకు కసరత్తు చేస్తున్నాయని KA ఐటీ మినిస్టర్ ప్రియాంక్ ఖర్గే వెల్లడించారు.
News March 6, 2026
కేజీ వెండిపై రూ.5వేలు తగ్గుదల

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో <<19309772>>బంగారం<<>>తో పాటు ఇవాళ వెండి ధర తగ్గింది. కేజీ వెండిపై రూ.5వేలు తగ్గి రూ.2,90,000 పలుకుతోంది. గత 6 రోజుల్లో కేజీ వెండిపై రూ.35వేలు తగ్గుదల నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 6, 2026
తనూజ, దివ్వెల మాధురిపై పోలీసులకు ఫిర్యాదు

AP: తిరుమలలో <<19305826>>దివ్వెల మాధురి<<>>, బిగ్‌బాస్ ఫేమ్ తనూజ బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడంపై TTD స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా వేడుకలు జరుపుకున్నందుకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుమల గెస్ట్ హౌస్‌లలో ఇలాంటి వేడుకలు నిషేధమని వెల్లడించింది. వీడియోలు తీసి SMలో పోస్ట్ చేయడం సరైన పద్ధతి కాదని పేర్కొంది. ఇక ఈ ఘటనపై TTD విజిలెన్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


