News August 3, 2024

సిరిసిల్ల: కుక్కలతో ప్రాణాలు పోతున్నాయ్!

image

సిరిసిల్ల జిల్లాలో వీధి కుక్కలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. వీధుల్లో గుంపులుగా తిరుగుతుండటంతో వాటిని చూసి ప్రజలు జంకుతున్నారు. వీటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది కుక్కలు, కోతుల దాడిలో గాయపడిన వారు 1,543 మంది ఉన్నారు. 3 రోజుల క్రితం ముస్తాబాద్‌ మండలం సేవాలాల్‌తండాలో అర్ధరాత్రి ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలిని కుక్కలు పీక్కుతిన్న విషయం విదితమే.

Similar News

News April 1, 2026

KNR: వర్సిటీలో అర్బన్ నక్సలైట్ల అలజడి.. వీసీకి వినతి

image

కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీ పీజీ, పరిశోధక విద్యార్థుల క్యాంపస్‌లో అర్బన్ నక్సలైట్లు తిష్ట వేశారనే వార్తలతో ఆందోళన వ్యక్తమవుతుంది. దీనివల్ల విశ్వవిద్యాలయ ప్రతిష్ఠ దెబ్బతింటుందని, ప్లేస్‌మెంట్లు ప్రభావితమవుతాయని పలువురు విద్యార్థులు వీసీకి బుధవారం వినతిపత్రం అందజేశారు. అనుమానితుల అడ్మిషన్లు రద్దు చేసి, సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే యూనివర్సిటీ ముట్టడిస్తామని హెచ్చరించారు.

News April 1, 2026

పుదుచ్చేరి ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌గా మంత్రి పొన్నం

image

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పుదుచ్చేరికి స్టార్ క్యాంపెయినర్, ఎన్నికల పరిశీలకునిగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఏఐసీసీ నియమించించింది. నేటి నుంచి మూడు రోజులు ఆయన పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తూ, పార్టీ విజయానికి కృషి చేయనున్నారు. ఆయన వెంట కరీంనగర్, సిద్దిపేట జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు ప్రచారానికి వెళ్లనున్నారు.

News April 1, 2026

కరీంనగర్: రేపు గ్రామ, వార్డు సభలు.. ప్రభుత్వ సూచనలు

image

1) ఉ.10గంటలకు రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ ఆలపించి, సభను ప్రారంభించాలి.
2) గ్రామసభలో సర్పంచ్‌తోపాటు పాలకవర్గం, వార్డు సభలో మున్సిపల్ ఛైర్మన్‌తోపాటు పాలకవర్గం, అధికారులు, ప్రజలు హాజరుకావాలి.
3) CMసందేశాన్ని చదివి వినిపించాలి.
4) ప్రభుత్వ విజయాలు, 6గ్యారంటీలపై అవగాహన కల్పించి, పథకాలకు అర్హులను గుర్తించాలి.
5) ప్రజాసమస్యల కోసం ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయాలి.. పరిష్కారాలపై కార్యాచరణ రూపొందించాలి.