News August 3, 2024
HYD: రెండేళ్లలోపే పూర్తి చేస్తాం: మంత్రి

HYD నగరం సహా రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. HYD టీమ్స్ ఆసుపత్రులను 14 అంతస్తులకే పరిమితం చేస్తామని, ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాల హాస్టల్స్ భవనాలను రెండేళ్లలోపే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక ప్రణాళికతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు.
Similar News
News January 18, 2026
రంగారెడ్డి జిల్లాలో మహిళలకు 62 స్థానాలు

రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల పరిధిలో 126 వార్డులు ఉన్నాయి. వీటిలో ఆమనగల్లులో 15, చేవెళ్లలో 18, ఇబ్రహీంపట్నంలో 24, మొయినాబాద్‌లో 26, షాద్‌నగర్‌లో 28, శంకర్‌పల్లిలో 15 వార్డులు ఉన్నాయి. వీటిలో ST మహిళ, SC మహిళ, BC మహిళ, అన్‌రిజర్వ్‌డ్ మహిళలకు 62 స్థానాలు దక్కాయి. ఆమనగల్లులో 7, చేవెళ్లలో 9, ఇబ్రహీంపట్నంలో 12, మొయినాబాద్‌లో 13, షాద్‌నగర్‌లో 14, శంకర్‌పల్లిలో 7వార్డులు మహిళలకు కేటాయించారు.
News January 13, 2026
RR: వారికి రేషన్ డీలర్ కట్ చేస్తాం: మాచన

రంగారెడ్డి జిల్లాలోని కొందరు రేషన్ డీలర్లు సర్పంచ్‌లుగా పోటీ చేసి గెలుపొందారని ఇది గొప్ప పరిణామమని పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ మాచన రఘునందన్ అన్నారు. కానీ సర్పంచ్‌లు అయ్యాక డీలర్‌గా కొనసాగటం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం రాజకీయ పార్టీల మద్దతుతో పోటీ చేసిన డీలర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే డీలర్ షిప్ రద్దుకు సిఫారసు చేస్తామన్నారు.
News January 9, 2026
HYD: 2 రోజులు వాటర్ బంద్

నగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2 పరిధిలోని పలు ప్రాంతాలకు రేపు ఉ.6 గం. నుంచి ఆదివారం సా.6 వరకు అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు తెలిపారు. వనస్థలిపురం, ఆటోనగర్, వైశాలినగర్, నాగోల్, బడంగ్ పేట, ఆదిభట్ల, బాలాపూర్ రిజర్వాయర్, నాచారం, తార్నాక, లాలాపేట, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు, శాస్త్రిపురం నేషనల్ పోలీస్ అకాడమీ తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు.


