News August 3, 2024
NLG: ఆరేళ్లుగా నిరీక్షణ.. పెండింగ్ దరఖాస్తులకు మోక్షం ఏది?

ఆహారభద్రతా కార్డుల్లో రెండో బిడ్డ వివరాలను చేర్పించే అవకాశం లేకుండా పోయింది. కనీసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా వీలు లేదు. దీంతో వేలాది మంది బాధితులు వారి బిడ్డల వివరాలు కార్డుల్లో లేకపోవడంతో మదనపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 10.07 లక్షల రేషన్ కార్డులు ఉండగా.. 29.84 లక్షల మంది సభ్యులు (యూనిట్లు) ఉన్నారు. సుమారు 50 వేల మందికి పైగా మీ-సేవా కేంద్రాల్లో ఆరేళ్ల క్రితమే దరఖాస్తు చేసుకున్నారు.
Similar News
News September 14, 2025
రేపు పోలీస్ గ్రీవెన్స్ డే రద్దు: SP

జిల్లాలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటన నేపథ్యంలో సోమవారం నిర్వహించాల్సిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. గవర్నర్ పర్యటన భద్రతా ఏర్పాట్లు, ఇతర అంశాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాల్సినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజలందరూ విషయాన్ని గమనించగలరని కోరారు. తదుపరి గ్రీవెన్స్ డే యథావిధిగా ఉంటుందని పేర్కొన్నారు.
News September 14, 2025
రేపు MGU 4వ స్నాతకోత్సవం

నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవానికి సిద్ధమైంది. సోమవారం యూనివర్సిటీలో నిర్వహించే స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ స్నాతకోత్సవంలో 22 మంది రీసెర్చ్ స్కాలర్స్‌కు PHD పట్టాలు, 57 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేయనున్నారు. యూనివర్సిటీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 150 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ లభించాయి.
News September 14, 2025
NLG: రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

జిల్లాలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటన నేపథ్యంలో రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దయినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో అధికారుల సమీక్ష రద్దు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు రేపు ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌కు రావద్దని ఆమె కోరారు. వచ్చే సోమవారం ప్రజావాణి యథావిధిగా జరుగుతుందని పేర్కొన్నారు.