News August 3, 2024
ఒక్క ఇల్లు తప్ప.. ఊరు ఊరంతా కొట్టుకుపోయింది!

హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బర్స్ట్ తీవ్ర విపత్తును సృష్టించింది. ఒక్కసారిగా వచ్చిపడిన వరదలో సామేజ్ అనే గ్రామంలో ఒక ఇల్లు తప్ప మొత్తం కొట్టుకుపోయింది. తాము ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని ఆ కుటుంబీకులు పంచుకున్నారు. ‘వరద తర్వాత బయట చూస్తే మా ఇల్లు తప్ప ఇంకేమీ మిగల్లేదు. వెంటనే సమీపంలోని కాళీమాత ఆలయానికి పరిగెత్తి తలదాచుకున్నాం’ అని పేర్కొన్నారు. ఈ విలయంలో 53మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.
Similar News
News January 29, 2026
కేసీఆర్‌కు మూడోసారి నోటీసులు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు మాజీ CM KCRకు పోలీసులు నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ఆసక్తిగా మారుతోంది. గతంలోనూ ఆయనకు వేర్వేరు ఇష్యూల్లో నోటీసులు అందాయి. INC అధికారంలోకి వచ్చిన తర్వాత PPAలపై జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ నోటీసులు ఇచ్చింది. దానిపై KCR హైకోర్టుకెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ కూలడంపై ఏర్పాటైన జస్టిస్ ఘోష్ కమిషనూ నోటీసులిచ్చింది. KCR ఆ కమిషన్ ముందు హాజరయ్యారు.
News January 29, 2026
యాసంగి ఆముదం పంటలో పురుగుల కట్టడికి సూచనలు

యాసంగిలో సాగు చేసిన ఆముదం పంటలో వివిధ పురుగుల తీవ్రత పెరిగింది. రసం పీల్చే పురుగుల ఉద్ధృతి ఎక్కువగా ఉంటే వీటి నివారణకు ప్రొఫెనోఫాస్ 2ML లేదా ఎసిటామిప్రిడ్ 0.2గ్రా లేదా ఎసిఫేట్ 1.5గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పంటను లద్దె పురుగు ఆశిస్తే లీటరు నీటికి నొవాల్యురాన్ 1ML కలిపి పిచికారీ చేయాలి. కాయతొలుచు పురుగు నివారణకు లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2ML కలిపి పిచికారీ చేయాలి.
News January 29, 2026
పేపర్ ప్లేట్‌గా బ్యాంకు డాక్యుమెంట్.. ప్రైవసీ అంటే ఇదేనా?

కస్టమర్ పర్సనల్ డీటెయిల్స్ ఉన్న బ్యాంకు డాక్యుమెంట్ రోడ్డు పక్కన పేపర్ ప్లేట్‌గా మారడం ఇప్పుడు వైరలవుతోంది. పేరు, లొకేషన్, పేమెంట్ డీటెయిల్స్ వంటి సెన్సిటివ్ డేటా బహిరంగంగా కనిపించడంతో నెటిజన్లు షాకవుతున్నారు. కస్టమర్ డేటాను బ్యాంకులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా వదిలేస్తాయని ప్రశ్నిస్తున్నారు. Moronhumor పేరిట ఉన్న X అకౌంట్లో ఈ ఫొటో చూశాక డేటా ప్రైవసీపై SMలో పెద్ద చర్చే నడుస్తోంది.


