News August 3, 2024
మాజీ ఎంపీ బీబీ పాటిల్‌ని కలిసిన మందకృష్ణ మాదిగ

జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యుడు బీబీ పాటిల్‌ను MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ శనివారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగని శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. బీబీ పాటిల్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ అలుపెరగని పోరాటం చేశారన్నారు.
Similar News
News March 12, 2026
నిజామాబాద్ GGHలో వరల్డ్ కిడ్నీ డే

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లోని డయాలసిస్ కేంద్రంలో గురువారం వరల్డ్ కిడ్నీ డే నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెడెంట్ డాక్టర్ శ్రీనివాస్ డయాలసిస్ రోగులు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ముందే డయాలసిస్ వరకు రాకుండా కేర్ తీసుకొని హై బీపీ, షుగర్ వ్యాధితో ఉన్నవారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆహార నియమాలు పాటించాలని సూచించారు. డాక్టర్ జలగం తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.
News March 12, 2026
NZB: వారిపై ఎంటీపీ చట్టం ప్రకారం చర్యలు: DMHO

ఎవరైనా పుట్టబోయే శిశువు అమ్మాయి అని తెలియజేసి, వెంటనే గర్భ విచ్చిత్తికి పాల్పడితే వారిపై ఎంటీపీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని NZB DMHO డా.రాజశ్రీ హెచ్చరించారు. గురువారం నిర్వహించిన గర్భస్త పూర్వ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశంలో ఆమె మాట్లాడారు. పీసీపీఎన్‌డీటీలో నమోదు అయిన వైద్యులు మాత్రమే స్కానింగ్ మిషన్లను వాడాలని సూచించారు.
News March 12, 2026
NZB: డిగ్రీ విద్యార్థినులకు కలెక్టర్ పాఠాలు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారంలో ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల
డిగ్రీ విద్యార్థినులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి కొద్దిసేపు వివిధ అంశాలపై బోధించారు. గురువారం కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాగా చదువుకొని ఉన్నత విద్యను పూర్తి చేసుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సూచించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ దశలో చదువును ఆపకూడదన్నారు.


