News August 3, 2024
HYD: యూనివర్సిటీలో 85 శాతం సీట్లు తెలంగాణ వారికే!

HYD మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఈ విద్యాసంవత్సరం 2024-25 నుంచి 85% సీట్లు తెలంగాణ స్థానికత ఉన్నవారికే కేటాయించనున్నట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్ రమేష్ బాబు తెలిపారు. తెలంగాణ ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఇది అమలులోకి వచ్చిందని తెలిపారు. 15% అన్ రిజర్వుడ్‌గా ఉంటుందని పేర్కొన్నారు.
Similar News
News March 9, 2026
HYD మెట్రో ‘భారం’.. ఆర్థిక సంక్షోభం!

హైదరాబాద్ మెట్రో మొదటి దశను ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకునే ప్రక్రియ ఈ మార్చి నాటికి తుది దశకు చేరుతుంది. సుమారు ₹13,000 కోట్ల అప్పులతో పాటు L&Tకి ₹2,000 కోట్ల సెటిల్మెంట్ చెల్లించేలా ఒప్పందం కుదిరింది. PPP మోడల్ విఫలమైందని అడ్మినిస్ట్రేషన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ, ప్రభుత్వంపై పడుతున్న ఈ భారీ ఆర్థిక భారం భవిష్యత్తులో సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
News March 9, 2026
HYD: పట్టాల మాటున ప్లాట్ల వ్యాపారం!

రైలు పట్టాల కింద ఉన్న భూములే మెట్రో ఫేట్ డిసైడ్ చేస్తున్నాయా? 2వ దశ విస్తరణలో అలైన్‌మెంట్ మార్పుల వెనుక రియల్ ఎస్టేట్ మాఫియా హస్తం స్పష్టంగా కనిపిస్తోంది. JAN 2026లో ప్రభుత్వం ₹2,787 కోట్ల భూసేకరణ నిధులను కేటాయించింది. ఎయిర్‌పోర్ట్, ఫోర్త్ సిటీ మెట్రో రూట్లను పదేపదే మార్చడంతో ప్రైవేట్ వెంచర్ల విలువ ₹వేల కోట్లకు చేరింది. TOD పేరుతో జరుగుతున్న ఈ భూముల కేటాయింపులపై ఇప్పటికే హైకోర్టులో PIL దాఖలయ్యాయి.
News March 9, 2026
బిన్ ఫ్రీ HYD.. చెత్తంతా ఖాళీ ప్లాట్లలోనే

నగరాన్ని GHMC, CMC, MMC కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసింది అవార్డుల కోసమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. HYD బిన్ ఫ్రీ అయిందని ఆఫీసర్లు ఢిల్లీకి రిపోర్టులు పంపుతున్నారని టాక్. కానీ, గల్లీల్లోకి వస్తే అసలు రంగు బయట పడుతుందన్నది ప్రజల మాట. టాప్ ర్యాంక్ వస్తే ‘మేమే NO.1’ అని చెప్పుకోవచ్చనేది ప్లాన్‌గా తెలుస్తోంది. దీంతో కేంద్రాన్ని మెప్పించినా, రోజూ ఆ దుర్వాసన పీల్చే జనాల్ని ఎలా నమ్మిస్తారనేది ప్రశ్న.


