News August 3, 2024
సంగారెడ్డి: జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున నాందేడ్ అకోలా 161వ జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వ్యక్తి శరీరం నుజ్జునుజ్జు అయిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పుల్కల్ పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 12, 2026
మెదక్: టెన్త్ పరీక్షలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం విద్యాశాఖ కార్యాలయంలో 9848214166 కంట్రోల్ రూమ్ నెంబర్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా పట్టుదల, క్రమశిక్షణతో చదివి మెదక్ జిల్లాను పదో తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిపి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. జిల్లాలో ఇందుకోసం మొత్తం 68 రెగ్యులర్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
News March 12, 2026
తూప్రాన్: విషాదం.. కొడుకు కోసం వెళ్లి తల్లి మృతి

తూప్రాన్ పట్టణ పరిధిలోని కరీంగూడకు చెందిన గోగుల లక్ష్మి(45) కొడుకును వెతికేందుకు వెళ్లిన నీటిలో మునిగి చనిపోయింది. మూడు రోజులుగా పనులకు వెళ్లిన కోడుకు కనిపించకుండా పోవడంతో నిన్న రాత్రి కొడుకును వెతికేందుకు వెళ్లిన ఆమె అల్లాపూర్ శివారులోని నీటిలో పడి మృతి చెందింది. గురువారం మృతదేహాన్ని గుర్తించగా కొడుకు ఫిర్యాదుతో తూప్రాన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 12, 2026
మెదక్: ఇంటర్ పరీక్షలకు 96.71 % హాజరు

మెదక్ జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. జనరల్ విభాగంలో 6085 మందికి గాను 5895 మంది, ఒకేషనల్ విభాగంలో 279 మందికి గాను 260 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలో 96.71% హాజరు నమోదైంది. నేటితో మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు.


