News August 3, 2024
ఆ ఒక్కడి కోసం 16మంది ఖైదీలను వదిలేసిన పుతిన్

రష్యా ఆవిర్భావం తర్వాత జరిగిన అతి పెద్ద ఖైదీల మార్పిడిలో రష్యా గత నెలలో 16మంది పాశ్చాత్య ఖైదీలను వదిలేసింది. బదులుగా 8మంది రష్యన్లను విడిపించుకుంది. క్రషికోవ్ అనే ఒక్కడి కోసం రష్యా ఈ డీల్ ఒప్పుకొంది! పుతిన్ శత్రువుల్ని చంపడం అతడి పని. జర్మనీలో 2019లో హత్య చేసి పట్టుబడి జైలుపాలయ్యాడు. అతడిని విడిపించేందుకే పుతిన్ ఖైదీల్ని వదిలేశారు. క్రషికోవ్‌ను ఆయనే ఎయిర్‌పోర్టుకు వచ్చి రిసీవ్ చేసుకోవడం విశేషం.
Similar News
News March 8, 2026
7 రోజుల్లో గల్ఫ్ నుంచి భారత్‌కు 52వేల మంది

ప.ఆసియా, గల్ఫ్‌లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఎయిర్ స్పేస్ పాక్షికంగా తెరుచుకోవడంతో ఎయిర్‌లైన్స్ సంస్థలు కమర్షియల్ ఫ్లైట్స్ నడుపుతున్నాయని, MAR 1 నుంచి 7వ తేదీ మధ్య 52వేల మంది గల్ఫ్ నుంచి INDకి తిరిగొచ్చారని వెల్లడించింది. ఫ్లైట్స్ అందుబాటులో లేని దేశాల్లో ఉన్నవారు ఇన్ఫర్మేషన్ కోసం ఎంబసీ/కన్సులేట్‌ను సంప్రదించాలంది. హెల్ప్ లైన్ <
News March 8, 2026
ఈరోజైనా అభి’షేక్’ చేస్తాడా?

T20 WCలో నిరాశ పరుస్తున్న భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఇవాళ NZతో ఫైనల్లోనైనా చెలరేగి ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫామ్‌లో ఉన్న శాంసన్‌కు తోడు అభి రాణిస్తే బ్యాటింగ్‌లో INDకి తిరుగుండదు. నిన్న ప్రాక్టీస్ టైమ్‌లో అభితో హెడ్ కోచ్ గంభీర్ 40 నిమిషాలపాటు మాట్లాడినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. కాగా ఈ WCలో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ 7 ఇన్నింగ్స్‌లలో 89 రన్స్ మాత్రమే చేశారు. ఇందులో 3 డకౌట్లు ఉన్నాయి.
News March 8, 2026
WBలో ప్రొటోకాల్ వివాదం.. అమిత్ షా, CBN ఏమన్నారంటే

ప.బెంగాల్‌లోని TMC ప్రభుత్వం తమ అరాచక ప్రవర్తనతో అథఃపాతాళానికి దిగజారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. ‘ప్రోటోకాల్ పాటించకుండా రాష్ట్రపతిని అవమానించారు. <<19322594>>ఈ ఘటన<<>> దేశానికి, ప్రజాస్వామ్యానికి అవమానం’ అని ట్వీట్ చేశారు. రాష్ట్రపతిని అవమానించేలా WB ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమని, ఈ ఘటన బాధ కలిగించిందని AP CM CBN తెలిపారు. రాష్ట్రపతి పట్ల గౌరవంతో మెలగాలన్నారు.


