News August 3, 2024
మోదీ చెప్పిన ‘కృషి పరాశర’ గ్రంథం ఏంటి?

వ్యవసాయంపై పరాశర మహర్షి 2000 ఏళ్ల క్రితమే <<13767183>>‘కృషి’ <<>>గ్రంథం రాశారు. కృషికి సేద్యమని అర్థం. ఇందులో వివిధ ఛందస్సుల్లో 240 శ్లోకాలు ఉన్నాయి. ఏయే మాసాల్లో ఎంత వర్షం కురుస్తుంది, భూమిని ఎప్పుడు, ఏ మేరకు, ఎలా చదును చేయాలి, విత్తనాలు ఎలా సేకరించాలి, ఎలా విత్తుకోవాలి, సస్య రక్షణ, ఎరువుల వాడకం, ఆవులు, గేదెలు సహా జీవాలను ఉపయోగించుకోవడం, వాటిపై పనిభారం, పంట కోత, పంట మార్పిడి, భూమి నిర్వహణ అంశాలను వివరించారు.
Similar News
News March 31, 2026
ఎలాంటి భోజనం తృప్తినిస్తుంది?

గంగిగోవు పాలు గరిటెడైనా చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: గాడిద పాలు కడవ నిండా ఉన్నా గరిటెడు ఆవు పాలతో సమానం కాదు. అలాగే ప్రేమ, భక్తితో పెట్టిన కొద్ది భోజనమైనా ఎంతో తృప్తిని ఇస్తుందని అర్థం.
<<-se>>#PADHYAM<<>>
News March 31, 2026
భారత్ తొలి మహిళా డాక్టర్.. ఎందరికో స్ఫూర్తి!

పాశ్చాత్య వైద్యశాస్త్రంలో పట్టాపొందిన తొలి భారతీయ మహిళ డాక్టర్.ఆనందీబాయి జోషి. 1865 MAR 31న మహారాష్ట్రలో జన్మించిన ఈమెకు తొమ్మిదేళ్లకే వివాహమైంది. 14ఏళ్ల వయసులో కొడుకు పుట్టగా సరైన వైద్య సౌకర్యాలు లేక పది రోజులకే చనిపోయాడు. మహిళా డాక్టర్ల అవసరాన్ని గ్రహించిన ఆమె మెడిసిన్ చదివేందుకు సిద్ధపడ్డారు. భర్త ప్రోత్సాహంతో సమాజాన్ని ఎదిరించి అమెరికా వెళ్లారు. 1886లో పట్టా పొంది భారత్ తిరిగొచ్చారు.
News March 31, 2026
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ₹100కోట్ల మార్క్ చేరుతుందా?

బాక్సాఫీసు కలెక్షన్లు తగ్గుతుండటంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంద కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అవుతుందా? లేదా? అనేది చర్చనీయాంశమైంది. ఉగాదికి (మార్చి 19) రిలీజైన ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ₹94.38కోట్ల గ్రాస్ నమోదు చేసింది. ఇక భారత్‌లో ఈ మూవీ నెట్ కలెక్షన్లు ₹70.29Crకు చేరాయి. రోజు రోజుకూ ఆక్యుపెన్సీ తగ్గుతుండటంతో ఈ సినిమా వంద కోట్ల మార్క్ అందుకోవడం కష్టమేనని సినీ వర్గాలు చెబుతున్నాయి.


