News August 3, 2024
Viral: మస్క్ పిల్లలతో పీఎం మోదీ ఫొటో
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పిల్లలకు ప్రధాని మోదీ షేక్ హ్యాండ్ ఇస్తున్న ఓ పాత ఫొటో నెట్టింట హల్ చల్ చేస్తోంది. డోజ్ డిజైనర్ అనే ట్విటర్ హ్యాండిల్ ఈ ఫొటోను ట్వీట్ చేసింది. దానికి మస్క్ సమాధానమివ్వడంతో ఫొటో వైరల్ అయింది. తన రిప్లైలో ‘డామియన్ అండ్ కై’ అంటూ పిల్లల పేర్లను మస్క్ వెల్లడించారు. మోదీతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని, తాను ఆయన ఫ్యాన్‌నని గతంలో మస్క్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
Similar News
News February 3, 2025
రేపు ఢిల్లీకి మంత్రి నారా లోకేశ్
AP: మంత్రి నారా లోకేశ్ రేపు సా.4.30 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సా.5.45 గంటలకు భేటీ కానున్నారు. రాష్ట్రానికి రైల్వే బడ్జెట్‌లో కేటాయింపులపై ధన్యవాదాలు తెలపడంతో పాటు పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. రాత్రి 9 గంటలకు తిరిగి లోకేశ్ విజయవాడ బయల్దేరనున్నారు. రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి రూ.9,417 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.
News February 3, 2025
మత మార్పిడులపై సంచలన బిల్లు
మతమార్పిడులపై సంచలన బిల్లును రాజస్థాన్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ బిల్లు ప్రకారం మత మార్పిడి చేసుకోవాలని నిర్ణయించుకున్నవారు దాదాపు 2 నెలల ముందు కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సొంతంగా నిర్ణయం తీసుకున్నామని, ఎవరి బలవంతం లేదని తెలిపితేనే అనుమతి లభిస్తుంది. ఎస్సీలు, తెగలు, మహిళలు, మైనర్లను బలవంతంగా మత మార్పిడులకు ప్రోత్సహిస్తే 2-10 ఏళ్ల జైలు శిక్ష, రూ.25వేల జరిమానా ఉంటుంది.
News February 3, 2025
ఎక్స్‌లెంట్ ఇన్నింగ్స్.. థాంక్యూ సాహా: BCCI
వృద్ధిమాన్ సాహా ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సేవలను కొనియాడుతూ BCCI పోస్టర్ విడుదల చేసింది. సాహాది అద్భుతమైన కెరీర్, ఎక్స్‌లెంట్ ఇన్నింగ్స్ అని పేర్కొంది. భారత జట్టుకు అందించిన సేవలకు థాంక్స్ చెప్పింది. భవిష్యత్తు మంచిగా సాగాలని కోరుకుంటున్నట్లు విష్ చేసింది. సాహా 28ఏళ్ల పాటు స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ తదితర లెవెల్స్‌లో క్రికెట్ ఆడారు.