News August 3, 2024

శ్రీకాకుళం: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పరిశీలన

image

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను శనివారం ప్రభుత్వం బాలుర డిగ్రీ కళాశాల మైదానంలో వివిధ శాఖల అధికారులతో ఆయన పరిశీలించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై అధికారులకు సలహాలు సూచనలు అందజేశారు. అందరికీ సరిపడే సిట్టింగ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

Similar News

News March 3, 2026

సిక్కోలు: మరి కాసేపట్లో క్లోజ్

image

శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ దేవాలయాలు కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా మంగళవారం మూతపడుతున్నాయి. ఈ విషయాన్ని ఆయా ఆలయాల ప్రధాన అర్చకులు తెలిపారు. చంద్రగ్రహణం నేపథ్యంలో మూత పడుతున్న ప్రముఖ దేవాలయాల జాబితాలో అరసవల్లి సూర్య దేవాలయం, శ్రీకూర్మనాథ ఆలయం, నారాయణ తిరుమల, ఉమారుద్ర కోటేశ్వర ఆలయం, శ్రీముఖలింగం తదితర దేవాలయాలు ఉన్నాయి. గ్రహణ త్యాగం అనంతరం ఆలయ సంప్రోక్షణ, భక్తులకు దర్శనాలు ఉంటాయన్నారు.

News March 3, 2026

బాణసంచా పేలి 21 మంది మృతి.. శ్రీకాకుళం కలెక్టర్ సీరియస్

image

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. జిల్లాలో బాణసంచా తయారీ నిల్వ విక్రయ కేంద్రాల వద్ద అగ్నిప్రమాద నివారణ చర్యలను అత్యంత కట్టుదిట్టం చేయాలన్నారు. కాకినాడ జిల్లా వేట్లపాలెం వద్ద పేలుడుతో 21 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.

News March 3, 2026

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు- కలెక్టర్