News August 3, 2024

వామ్మో.. ఎంతపెద్ద నాగుపామో!

image

గ్రామాల్లో కనిపించే విషసర్పాల్లో ఒకటైన నాగుపాము సాధారణంగా 4-5 అడుగుల పొడవు పెరుగుతుంటుంది. అయితే, తెలంగాణలోని వనపర్తికి చెందిన రాంబాబు అనే వ్యక్తి ఇంట్లో చొరబడిన ఏడు అడుగుల నాగుపామును స్నేక్ సొసైటీ సభ్యుడు కృష్ణ సాగర్ పట్టుకున్నాడు. తాను ఇప్పటివరకు 7,013 పాములను పట్టుకున్నానని, ఇంతటి భారీ పరిమాణం ఉన్న సర్పాన్ని చూడటం ఇదే తొలిసారి అని ఆయన చెప్పారు. పామును కృష్ణ సాగర్ పట్టుకున్న ఫొటో వైరలవుతోంది.

Similar News

News March 14, 2026

అస్సాం కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌లో 150 ఉద్యోగాలు

image

అస్సాం కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌ 150 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్ కలిగి ఉండి, 21-38 ఏళ్ల మధ్య వయసు వారు అప్లై చేయొచ్చు. జీతం రూ.18,730- రూ.68,040 వరకు ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ MAR 20 నుంచి ప్రారంభం. చివరి తేదీ APR-19. రాత పరీక్ష, ఇంటర్వ్యూతో ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు acab.bank.in చూడండి.

News March 14, 2026

వారం రోజుల్లో ‘గాంధీ సరోవర్’కు శంకుస్థాపన!

image

TG: మూసీ బ్యూటిఫికేషన్‌లో భాగంగా చేపడుతోన్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు వారం రోజుల్లో శంకుస్థాపన జరగనుంది. ఎల్లుండి నుంచి జరిగే అసెంబ్లీ సెషన్‌లో దీనిపై చర్చించి ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. మూసీ ఒడ్డున ఉన్న 800ఏళ్ల నాటి శివాలయాన్నీ పునరుద్ధరించనుంది. ఉస్మానియా ఆస్పత్రి స్థలంలో మల్టీపర్పస్ కాంప్లెక్స్ నిర్మించనుంది. ఓ భారీ మసీదును నిర్మించేందుకు సౌదీ యువరాజు ముందుకొచ్చినట్లు సమాచారం.

News March 14, 2026

కష్ట సమయంలో ఇరాన్ ప్రజలకు అండగా ఉంటాం: చైనా

image

ఇరాన్‌కు మానవతా సహాయం కింద 2 లక్షల డాలర్లను (రూ.1.85 కోట్లు) విరాళంగా ఇస్తున్నట్లు చైనా ప్రకటించింది. మిస్సైల్ దాడిలో మరణించిన 165 మంది స్కూల్ పిల్లల తల్లిదండ్రులకు ఈ సాయం అందిస్తున్నట్లు వెల్లడించింది. స్కూళ్లు, పిల్లలపై దాడి చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. ఇలాంటి కష్ట సమయంలో తాము ఇరాన్ ప్రజలకు అవసరమైన సాయం చేస్తామని ప్రకటించింది.