News August 3, 2024
హైదరాబాద్‌లో ఇక సందడే.. సందడి

మూడంతో 3 నెలలు నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు సోమవారం నుంచి మొదలు కానున్నాయి. ఎల్లుండి నుంచి శ్రావణ మాసం మొదలు కానున్న నేపథ్యంలో HYD, ఉమ్మడి RRలో ఫంక్షన్ హాళ్లకు గిరాకీ రానుంది. ఈనెల 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28, 30వ తేదీల్లో వివాహ ముహూర్తాలు ఉన్నట్లు అర్చకులు తెలిపారు. గృహప్రవేశాలకు ఇప్పటికే చాలామంది శుభ ముహూర్తాలు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కాగా, శ్రావణ మాసం SEP3తో ముగుస్తుంది.
Similar News
News September 18, 2025
HYD: నల్లాబిల్లు కట్టాలని క్రెడిట్‌కార్డు ఖాళీ చేశాడు!

సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో డబ్బు కాజేస్తున్నారు. పెండింగ్ నల్లా బిల్లు చెల్లించాలని ఆన్‌లైన్ లింక్ పంపి ఓ వ్యక్తి నుంచి రూ.95,237 కాజేశారు. ఎల్బీనగర్ మన్సూరాబాద్ శ్రీరామ్ నగర్ కాలనీవాసి సంకలమద్ది శ్రీనివాస్ రెడ్డికి SEPT 11న వాటర్ బోర్డుకు బిల్లు చెల్లించాలని 6303323494 నుంచి వాట్సప్ లింక్ పంపాడు. ఈనెల బిల్ చెల్లించలేదని, నిజమేనని నమ్మి APK ఫైల్ ఇన్‌స్టాల్ చేయగా క్రెడిట్ కార్డు కాళీ అయింది.
News September 18, 2025
HYD: దుర్గామాత మండపాలకు అనుమతి తప్పనిసరి

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఏర్పాటు చేసే దుర్గామాత మండపాలకు నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నిర్వాహకులు మండపాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు. వెబ్‌సైట్ https://policeportal.tspolice.gov.in/index.htmలో నమోదు చేయాలన్నారు.
News September 18, 2025
HYD: వైద్య సేవల బలోపేతంపై మంత్రి సమీక్ష

ఉస్మానియా మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రులలో వైద్య సేవల బలోపేతంపై మంత్రి దామోదర రాజనరసింహ ఎస్ఆర్ నగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రిలోని పాత భవనాల పరిస్థితిపై క్షేత్రస్థాయిలో పర్యటించి 2, 3 రోజుల్లో నివేదిక సమర్పించాలని TGMSIDC ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.