News August 3, 2024

ఏలూరు జిల్లాలో 36,480 ఇళ్లు పూర్తి: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో పేదల గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. పేదల గృహ నిర్మాణ పనులపై కలెక్టరేట్ నుంచి మండల స్థాయిలోని గృహ నిర్మాణ శాఖ సిబ్బందితో టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్షించారు. జిల్లాకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ, గ్రామీణ పథకాల కింద 1,30,264 ఇళ్లు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. వాటిలో 36,480 ఇళ్ల పనులు పూర్తి చేశామన్నారు.

Similar News

News March 10, 2026

అమరావతిలో కలెక్టర్ల సదస్సుకు ప.గో కలెక్టర్ నాగరాణి

image

అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మార్చి 11, 12న జరగనున్న కలెక్టర్ల సదస్సుకు జిల్లా కలెక్టర్ నాగరాణి హాజరుకానున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ సమావేశంలో జిల్లాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, రెవెన్యూ అంశాలపై విపులంగా చర్చించనున్నారు. ముఖ్యంగా ‘స్వర్ణాంధ్ర @ 2047’ పది సూత్రాల అమలు, శాంతిభద్రతలు, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రగతిపై సీఎం సమీక్షించనున్నారు.

News March 10, 2026

ATM కార్డు మార్చి.. తణుకులో వృద్ధుడికి కుచ్చుటోపీ

image

ఏటీఎం కేంద్రంలో సహాయం చేస్తానని నమ్మించి ఓ వృద్ధుడిని మోసగించిన ఘటన తణుకులో కలకలం రేపింది. ఎన్‌ఎస్‌సీ బోస్‌ రోడ్డుకు చెందిన బచ్చు సుబ్బారావు సోమవారం ఎస్‌బీఐ ప్రధాన శాఖ ఏటీఎంలో నగదు తీయడానికి వెళ్లారు. అక్కడ ఉన్న గుర్తుతెలియని వ్యక్తి సహాయం నెపంతో కార్డు మార్చేసి, సుబ్బారావు ఖాతా నుంచి రూ.23,430 నగదు కాజేశాడు. నగదు విత్‌డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.

News March 10, 2026

ప.గో: అదనపు కట్నం వేధింపులు.. భర్తతో సహా నలుగురిపై కేసు

image

అదనపు కట్నం తేవాలని వేధిస్తున్న భర్త, అత్త, మరిది, మరదలుపై నరసాపురం టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కథనం.. లుటుకుర్తి రాజేశ్‌కు స్వరూపతో 2020లో వివాహమైంది. అప్పటి నుంచి రాజేశ్ అదనపు కట్నం తేవాలని, అనారోగ్యంతో ఉన్న పిల్లాడి వైద్యానికి కూడా డబ్బులు పంపకుండా, గల్ఫ్‌లో ఉంటూ భర్త వేధిస్తున్నాడని బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్ఐ ముత్యాలరావు కేసు నమోదు చేశారు.