News August 3, 2024
ఆదిలాబాద్: AEE ఫలితాల్లో సత్తా చాటిన నిరుపేద యువతి

ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన క్యాతం అపర్ణ అనే యువతి తొలి ప్రయత్నంలోనే ఇరిగేషన్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించింది. ఇటీవల విడుదలైన టీఎస్పీఎస్సీ ఉద్యోగ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈఈ(అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) ఉద్యోగానికి ఎంపికైంది. సాధారణ నిరుపేద రైతు కుటుంబం నుంచి మొదటి ప్రయత్నంలోనే ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక కావడంతో పలువురు ఆమెను అభినందిస్తున్నారు.
Similar News
News March 24, 2026
నిర్మల్: కొయ్యబొమ్మలకు జీవం పోసేలా..?

నిర్మల్ జిల్లా గర్వకారణమైన కొయ్యబొమ్మల కళకు పూర్వవైభవం తెచ్చేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. ‘పొనికి’ కర్ర కొరతతో ఈ పరిశ్రమ సంక్షోభంలో పడటంతో సాగును ప్రోత్సహించాలని నిర్ణయించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ పర్యవేక్షణలో ఉపాధి హామీ పథకం ద్వారా ఎర్రమట్టి నేలల్లో పొనికి మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ప్రతి గ్రామంలో వీటిని పెంచడం ద్వారా కళాకారులకు ముడిసరుకు ఇబ్బంది లేకుండా చేయడమే లక్ష్యం.
News March 23, 2026
గ్యాస్ దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవు: ADB SP

ఆదిలాబాద్ జిల్లాలో గృహ వినియోగ LPG గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు వినియోగించవద్దని SP అఖిల్ మహాజన్ హెచ్చరించారు. రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా 8 బృందాలతో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. గ్యాస్ దుర్వినియోగం ప్రమాదాలకు దారి తీస్తుందని సూచించారు. అనుమానాస్పద వినియోగంపై డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.
News March 23, 2026
ADB: ఇంగ్లిష్ పరీక్షకు 18మంది గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. సోమవారం ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని అధికారులు పేర్కొన్నారు. మొత్తం 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా సోమవారం జరిగిన పరీక్షకు 10878 మంది విద్యార్థులకు గాను 10860 మంది విద్యార్థులు హాజరై 18 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పోలీసుల బందోబస్తు నడుమ పరీక్షలు కొనసాగుతున్నాయి.


