News August 3, 2024
పర్చూరు: ఆటో డ్రైవర్ ఆత్మహత్య

గుంటూరు జిల్లా చేబ్రోలులో ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన ఆటో డ్రైవర్ శివకృష్ణ(26) మామిడి చెట్టుకి ఉరివేసుకొని శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పర్చూరు ప్రాంతానికి చెందిన శివకృష్ణ చేబ్రోలులో ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. కాగా ఇతను అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 28, 2025
ఫైరింగ్ ప్రాక్టీస్‌లో ప్రకాశం జిల్లా పోలీసులు.!

ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని ఫైరింగ్ రేంజ్ వద్ద ఆదివారం వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్‌ను SP హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పోలీస్ అధికారులు ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. అలాగే ఎస్పీ హర్షవర్ధన్ రాజు సైతం ఫైరింగ్ ప్రాక్టీస్ చేసి అధికారుల్లో ఉత్సాహం నింపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఫైరింగ్ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఏకాగ్రతతో ఉండాలన్నారు.
News December 28, 2025
ప్రకాశం జిల్లాకు సక్రమంగా సాగర్ జలాలు వచ్చేనా..?

ప్రకాశం జిల్లాకు నాగార్జునసాగర్ జలాల సరఫరా <<18628823>>మెరుగుపడేలా<<>> చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి జలవనరుల శాఖ అధికారులను శనివారం ఆదేశించారు. తూర్పు నాయుడుపాలెం తనక్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాగార్జునసాగర్ నుంచి విడుదలవుతున్న జలాలు తగిన స్థాయిలో జిల్లాకు రాకపోవటానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 57 TMCలు సాగర్ జలాలు రావాల్సి ఉండగా ఇప్పటివరకు 34 TMCలు వచ్చాయన్నారు.
News December 28, 2025
ప్రకాశం జిల్లాకు సక్రమంగా సాగర్ జలాలు వచ్చేనా..?

ప్రకాశం జిల్లాకు నాగార్జునసాగర్ జలాల సరఫరా మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి జలవనరుల శాఖ అధికారులను శనివారం ఆదేశించారు. తూర్పు నాయుడుపాలెం తనక్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాగార్జునసాగర్ నుంచి విడుదలవుతున్న జలాలు తగిన స్థాయిలో జిల్లాకు రాకపోవటానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 57 TMCలు సాగర్ జలాలు రావాల్సి ఉండగా ఇప్పటివరకు 34 TMCలు వచ్చాయన్నారు.


