News August 3, 2024

నౌహీరా షేక్‌కు బిగుస్తున్న ఉచ్చు!

image

TG: హీరా గోల్డ్ కుంభకోణంలో నిందితురాలు నౌహీరా షేక్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బంజారాహిల్స్‌లోని సంస్థతో పాటు నౌహీరా షేక్ ఇంట్లో ED సోదాలు చేపట్టింది. టోలీచౌకిలోని ఆమె ప్లాట్లను స్వాధీనం చేసుకుంది. ఇప్పటి వరకు మొత్తం ₹380కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేసింది. తమ కంపెనీలో పెట్టుబడి పెడితే 36% లాభాలు వస్తాయని చెప్పి సామాన్యుల నుంచి ₹వేలకోట్లు వసూలు చేసి, ఆ నిధులు దారి మళ్లించినట్లు ఈడీ గుర్తించింది.

Similar News

News March 18, 2026

తెలంగాణలో రికార్డు స్థాయిలో గ్యాస్ డెలివరీలు

image

తెలంగాణలో మంగళవారం (మార్చి 17న) రికార్డు స్థాయిలో 2,35,678 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. ఇది సాధారణ సగటు సరఫరా (2.15 లక్షలు) కంటే ఎక్కువ. భారత్ పెట్రోలియం 57,635 (+22.63%), HP 84,156 (+11.98%), ఇండేన్ 93,887 (+1.00%) వృద్ధిని నమోదు చేశాయి. రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, కొరత ఉందన్న వదంతులను నమ్మి ‘పానిక్ బుకింగ్’ చేయొద్దని పౌర సరఫరాల శాఖ విజ్ఞప్తి చేసింది.

News March 18, 2026

ICC ర్యాంకింగ్స్.. కోహ్లీ, రోహిత్ స్థానాలివే..

image

ICC ప్రకటించిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో NZ బ్యాటర్ మిచెల్ తొలి స్థానంలో నిలిచారు. భారత బ్యాటర్లు కోహ్లీ(2), రోహిత్(4), గిల్(5), రాహుల్ (9) టాప్-10లో ఉన్నారు. బౌలింగ్‌లో భారత్ నుంచి కుల్దీప్(8) ఒక్కరే టాప్-10లో నిలిచారు. ఆల్‌రౌండర్లలో అక్షర్ పదో స్థానంలో ఉన్నారు. అటు T20 బ్యాటింగ్‌లో అభిషేక్(1), ఇషాన్(2), తిలక్(6), సూర్య(9) టాప్-10లో ఉన్నారు. బౌలర్లలో వరుణ్ 2, బుమ్రా 5వ స్థానంలో నిలిచారు.

News March 18, 2026

కావ్యా.. కాల్ చెయ్: లలిత్ మోదీ

image

పాక్ బౌలర్ అబ్రార్‌ను సన్‌రైజర్స్ కొనుగోలు చేసిన <<19366541>>వివాదం<<>>లోకి IPL ఫౌండర్ లలిత్ మోదీ ఎంటర్ అయ్యారు. ‘ఫ్యాన్స్ ఆవేశంలో ఉన్న సమయంలో ఒక పాక్ ప్లేయర్‌పై ₹2.34 కోట్లు ఇన్వెస్ట్ చేయడమా? ప్రజాభిప్రాయాన్ని ఎలా మేనేజ్ చేయాలో, సామ్రాజ్యాలను ఎలా నిర్మించాలో నాకు బాగా తెలుసు. నాకు కాల్ చెయ్’ అంటూ పరోక్షంగా SRH ఓనర్‌ కావ్యా మారన్‌ను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు.