News August 3, 2024

10Mల పిస్టల్ షూటింగ్‌.. టార్గెట్ ఎంత చిన్నగా ఉంటుందో తెలుసా?

image

భారతదేశ క్రీడాకారులు మనూ భాకర్, సరబ్జోత్ సింగ్ పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ పోటీల్లో కాంస్య పతకాన్ని గెలిచిన విషయం తెలిసిందే. అయితే, వీరు షూట్ చేసే టార్గెట్ సైజ్ ఎంత చిన్నగా ఉంటుందో తెలుసా? కేవలం రెండు ఇంచులే ఉండే టార్గెట్ సైజ్ పేపర్ ఫొటో వైరలవుతోంది. షాట్ పేపర్‌ మధ్యలోని చుక్కను తాకితే 10 పాయింట్లు. రైఫిల్‌కు సాధ్యమయ్యే అత్యధిక స్కోరు 654 అయితే పిస్టల్‌కు 600 మాత్రమే.

Similar News

News February 4, 2025

EWS ప్రయోజనాల కోసం ఇలా..: బీసీ మేధావుల ఫోరం

image

TG: కులసర్వేలో బీసీల జనాభా తగ్గడంపై BC మేధావుల ఫోరం పలు ప్రశ్నలు లేవనెత్తింది. 2014 సమగ్ర సర్వేలో బీసీల జనాభా 1.85 కోట్లు (51%) ఉంటే, ఇప్పుడు 1.64 కోట్లు (46.25%) మాత్రమే ఉందని ఫోరం నేతలు అన్నారు. BC, SC, ST, ముస్లింల జనాభా 25.98 లక్షలు తగ్గిందని, OCల జనాభా 15.89 లక్షలు పెరిగిందన్నారు. ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. EWS ప్రయోజనాలను కాపాడేందుకు లేదా డేటా ఎంట్రీ సమస్య వల్ల ఇలా జరిగి ఉండొచ్చన్నారు.

News February 4, 2025

కిడ్నీలలో రాళ్లు చేరకూడదంటే..

image

*రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి.
*ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలి.
*కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి.
*బరువును అదుపులో ఉంచుకోవాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి.
*ఆల్కహాల్, స్మోకింగ్ జోలికి వెళ్లొద్దు.

News February 3, 2025

ప్రైవేట్ స్కూళ్లపై మంత్రి లోకేశ్ కీలక నిర్ణయం

image

AP: ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు మంత్రి లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. వాటి గుర్తింపు గడువును పదేళ్లకు పెంచుతున్నట్లు వెల్లడించారు. విద్యా వ్యవస్థలో తీసుకురానున్న సంస్కరణల గురించి ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, యాజమాన్యాల సమావేశంలో వివరించారు. అందరం కలిసి విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దామని వారితో అన్నట్లు ట్వీట్ చేశారు. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధుల సమస్యలు పరిష్కరిస్తానన్నారు.