News August 3, 2024

రేపు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు

image

AP: అల్లూరి, ఏలూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, YSR జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Similar News

News March 14, 2026

1,300 బ్యాంక్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు 6 రోజులే గడువు

image

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI)లో 1,300 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 1,100 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, 200 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులున్నాయి. వయసు 21-30 ఏళ్లు, డిగ్రీ పాసైన వారు అర్హులు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 19. వెబ్‌సైట్: https://www.idbi.bank.in/

News March 14, 2026

ఇన్‌స్టాగ్రామ్‌‌లో ఇకపై నో ప్రైవసీ.. అలాంటి మెసేజ్‌లు చేస్తే..

image

Instagram నుంచి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను మే 8 తర్వాత తొలగించనున్నట్లు Meta ప్రకటించింది. ఇకపై యూజర్లు పంపే కంటెంట్‌ను Meta చూడనుంది. అయితే ఈ మార్పులకు గల కారణాలను కంపెనీ వెల్లడించలేదు. పిల్లల పట్ల లైంగిక, ఇతర వేధింపులకు సంబంధించిన మెసేజ్‌లను గుర్తించేందుకు ఈ మార్పులు చేస్తున్నట్లు సమాచారం. కాగా హానికర కంటెంట్‌ను గుర్తించేందుకు ఇలాంటి మార్పులు తేవాలని పలు దేశాలు గతంలోనే డిమాండ్ చేశాయి.

News March 14, 2026

10వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్?

image

AP: ఉగాది రోజున 60 విభాగాల్లో 10వేల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. డీఎస్సీలో భాగంగా 3,000కి పైగా టీచర్ పోస్టులు, 470 గ్రూప్-2, 101 గ్రూప్-1 పోస్టులు, వర్సిటీల్లో 1,500, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 1000 పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం. జాబ్ క్యాలెండర్‌లో మొత్తం ఎన్ని పోస్టులు ఉంటాయో మరో 2, 3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.