News August 3, 2024
కర్నూలు: త్వరలో ఎస్సైల బదిలీలు..?

ఉమ్మడి కర్నూలు జిల్లాలో త్వరలో ఎస్సైల బదిలీలు జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే DIG, SPలు, DSPలను ప్రభుత్వం బదిలీ చేసింది. తాజాగా కర్నూలు రేంజ్ పరిధిలో పెద్ద సంఖ్యలో CIలను బదిలీ చేస్తూ DIG డా.ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఇటీవలే నంద్యాల, కర్నూలు జిల్లాలకు కొత్త ఎస్పీలు ఛార్జ్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీలు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 8, 2025
త్వరలో రూ.8 కోట్లు విడుదల: కలెక్టర్

మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన ఉల్లి పంటకు రూ.10 కోట్లు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని, మిగిలిన రూ.8 కోట్లు త్వరలోనే జమ చేస్తామని కర్నూలు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంతో సాంకేతిక పరిజ్ఞానం, ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోలులో తేమశాతం 13-14% ఉన్నా కొనుగోలు చేయాలన్నారు.
News November 7, 2025
విద్యాసంస్థలకు రేపు సెలవు లేదు: డీఈవో

మొంథా తుఫాన్ ప్రభావం వల్ల కర్నూలు జిల్లా వ్యాప్తంగా గత నెల 29న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం రేపు రెండో శనివారం సెలవు ఉన్నప్పటికీ విద్యా సంవత్సరంలో పనిదినాలు అమలుపరచడంలో భాగంగా రేపు అన్ని స్కూళ్లు ఉంటాయని డీఈవో శామ్యూల్ పాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంఈఓలు, హెచ్ఎంలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
News November 7, 2025
బస్సుల్లో భద్రతా తనిఖీలు ముమ్మరం

ఇటీవల బస్సు ప్రమాదం నేపథ్యంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు పోలీసులు రాత్రిపూట తిరిగే బస్సులు, లారీలు, తదితర వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. వాహన పత్రాలు, డ్రైవర్ లైసెన్సులు పరిశీలిస్తూ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారో, లేదో చెక్ చేస్తున్నారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ‘ఫ్రెష్ వాష్ అండ్ గో’ కార్యక్రమం నిర్వహిస్తూ డ్రైవర్లకు నీటితో ముఖం కడిగించించి, నిద్ర మత్తు వదిలిస్తున్నారు.


