News August 3, 2024
పల్నాడు జిల్లాలో వేట కొడవళ్ల కలకలం

గురజాల మండలం దైద గ్రామంలో వేట కొడవళ్లు కలకలం రేపాయి. స్థానికుల కథనం మేరకు.. గుర్తు తెలియని వ్యక్తి ఫ్లెక్సీలో వేట కొడవళ్లు తీసుకెళ్తున్న సమయంలో గ్రామస్థులకు కనబడటంతో కొడవళ్లు గడ్డివాములో విసిరేసి పరారయ్యాడన్నారు. ఎవర, ఎక్కడికి తీసుకెళ్తున్నారనే సమాచారం తెలియాల్సి ఉంది. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కొడవళ్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News April 8, 2026
తాడేపల్లి: దేవదాయ శాఖ అధికారిణి నివాసంలో గుర్తించిన ఆస్తులివే!

తాడేపల్లిలో దేవదాయ శాఖ అధికారి శాంతి నివాసంలో ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు ఉన్నట్లు ACB అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఎండాడ (విశాఖ)లో లగ్జరీ ఫ్లాట్, కుంచనపల్లిలో జి+2 బిల్డింగ్, 770గ్రా. గోల్డ్, 3కేజీల సిల్వర్, బ్యాంక్ ఖాతాలో రూ. 3 లక్షల క్యాష్, రూ. 1.15 లక్షల క్యాష్, వోక్స్‌వ్యాగన్ కార్, బైక్, ఇతర విలువైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉన్నట్లు అధికారులు తాము చేసిన సుదీర్ఘ సోదాలలో గుర్తించారు.
News April 8, 2026
ప్రతి ఉద్యోగాన్ని ట్రాక్ చేయాలి: లోకేశ్

రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని, కల్పించిన ప్రతి ఉద్యోగాన్ని విధిగా ట్రాక్ చేయాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలో మంగళవారం ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు 6.25 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న 787 కంపెనీల పురోగతిని కూడా పర్యవేక్షిస్తామన్నారు. అన్నింటికీ సమాన ప్రాధాన్యత ఇస్తూ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని లోకేశ్ స్పష్టం చేశారు.
News April 7, 2026
తాడేపల్లి: ఏసీబీ వలలో దేవాదాయ శాఖ ఏసీ శాంతి

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. తాడేపల్లిలోని ఆమె నివాసంతో పాటు పలు చోట్ల జరిపిన సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు. 750 గ్రా. బంగారం, 3 కేజీల వెండి, ఆస్తి పత్రాలు, కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు గడించినట్లు నిర్ధారించిన ఏసీబీ బృందం, ఆమెను విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించింది.


