News August 3, 2024
SC, ST వర్గీకరణపై భారత్ బంద్‌కు బహుజన సంఘాల పిలుపు

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై బహుజన సంఘాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ రెండు వర్గాల్లో ఉపవర్గీకరణ చేపట్టాలన్న సుప్రీం ఆదేశాలకు నిరసనగా ఈనెల 21న భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. భీమ్ సేన, ట్రైబల్ ఆర్మీ చీఫ్‌ల పిలుపునకు వివిధ సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. ఈ తీర్పు ఎస్సీ, ఎస్టీల్లోని ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉందని మండిపడుతున్నాయి.
Similar News
News March 22, 2026
ఇదేందయ్యా ఇది.. మటన్ ఉడకలేదని పోలీస్ స్టేషన్‌కు..

AP: అనంతపురం పోలీసులకు వింత ఫిర్యాదు అందింది. తాడిపత్రికి చెందిన ఓ వ్యక్తి ఉగాది సందర్భంగా మటన్, తలకాయ కొనుగోలు చేశాడు. కుక్కర్‌లో సుమారు 20 సార్లు ఉడికించినా ఆ మాంసం ఉడకలేదని విక్రయదారుడిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. వండిన పాత్రతో సహా వెళ్లడంతో పోలీసులు అవాక్కయ్యారు. అతనికి సర్ది చెప్పి ఇంటికి పంపించారు.
News March 22, 2026
ఈ గ్రామంలో వర్షమే కురవదు!

యెమెన్‌లోని అల్ హుతైబ్ గ్రామం ప్రపంచంలోనే అత్యంత వింతైన ప్రదేశం. సముద్ర మట్టానికి సుమారు 3,200 మీటర్ల ఎత్తున పర్వత శిఖరంపై ఉండటం వల్ల ఇక్కడ అసలు వర్షమే కురవదు. మేఘాలన్నీ ఈ గ్రామం కంటే తక్కువ ఎత్తులోనే ఏర్పడటం వల్ల వర్షం పడదు. అందుకే దీనిని ‘డ్రై సిటీ’ అని పిలుస్తారు. ఇక్కడ మేఘాలు చేతికి తాకే ఎత్తులోనే ఉండటం విశేషం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో
News March 22, 2026
యుద్ధంతో పర్యావరణానికీ భారీ విధ్వంసం

పశ్చిమాసియాలో యుద్ధం పర్యావరణాన్నీ నాశనం చేస్తోంది. 2 వారాల్లో 5 మి. టన్నుల గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు(CO2, CH4, N20) విడుదలైనట్లు ఓ నివేదిక వెల్లడించింది. ‘ఇరాన్‌లో 20K భవనాలు దెబ్బతినడంతో 2.4M టన్నుల CO2 రిలీజైంది. 2.5-5.9మి. బ్యారెళ్ల చమురు ధ్వంసమవడంతో 1.88M టన్నుల C02 గాల్లో కలిసింది. దేశాలు వాడిన ఇంధనం, కోల్పోయిన జెట్స్, డ్రోన్లు, క్షిపణుల వల్ల కూడా విష పదార్థాలు విడుదలయ్యాయి’ అని తెలిపింది.


