News August 3, 2024
అక్టోబర్ 4 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు

అక్టోబర్ 4 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 4న ధ్వజారోహణం, 8న గరుడ సేవ, 9న స్వర్ణ రథం, 11న రథోత్సవం, 12న చక్రస్నానం నిర్వహిస్తారు. రోజూ ఉ.8, సా.7 గంటలకు వాహనసేవలు ప్రారంభమవుతాయి. వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ ఇప్పటికే రద్దు చేసింది.
Similar News
News March 11, 2026
‘ధురంధర్-2’ రన్‌టైమ్ ఎఫెక్ట్.. టికెట్ రేట్లు పెరుగుతాయా?

‘ధురంధర్-2’పై భారీ అంచనాలు నెలకొన్న వేళ ఆ మూవీ రన్‌టైమ్ 3 గంటల 55 నిమిషాలు (దాదాపు 4 గంటలు) ఉండటం చర్చనీయాంశమైంది. ఇది మల్టీప్లెక్సులకు సవాల్‌గా మారినట్లు తెలుస్తోంది. భారీ రన్‌టైమ్ వల్ల షోల సంఖ్య తగ్గిపోతుందని.. ఫలితంగా డైలీ గ్రాస్‌పై ఎఫెక్ట్ పడుతుందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. దానిని భర్తీ చేసేందుకు టికెట్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే ఆడియన్స్‌కు భారంగా మారుతుంది.
News March 11, 2026
‘హార్ముజ్’ దాటాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిందే: ఇరాన్

ఎన్నిసార్లు హెచ్చరించినా పట్టించుకోకపోవడంతోనే ఇండియాకు వెళ్తున్న థాయిలాండ్ <<19355576>>కార్గో షిప్‌పై దాడి<<>> చేశామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించారు. ‘హార్ముజ్ గుండా ఒక్క లీటర్ ఆయిల్‌ను కూడా వెళ్లనివ్వం. ఈ జలసంధి నుంచి వెళ్లాలంటే కచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సిందే’ అని స్పష్టం చేశారు. ముడి చమురు బ్యారెల్ రేట్ 200 డాలర్లకు చేరుకుంటుందని, ప్రపంచం సిద్ధంగా ఉండాలని ఇరాన్ మిలిటరీ కమాండ్ హెచ్చరించింది.
News March 11, 2026
గ్యాస్ బుకింగ్ సిస్టమ్ క్రాష్!

సాధారణం కంటే 8-10 రెట్లు ఎక్కువగా ఫోన్ కాల్స్ రావడంతో ఇండేన్ గ్యాస్ బుకింగ్ సిస్టమ్ కుప్పకూలినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశంలో ఇండేన్‌కు 15 కోట్ల కనెక్షన్లు ఉన్నాయి. చాలామంది వినియోగదారులు IVRS మిస్డ్ కాల్ ద్వారానే గ్యాస్ బుకింగ్ చేస్తుంటారు. దేశంలో LPG కొరత ఏర్పడిందని తెలిసి బుకింగ్‌కు పోటెత్తడంతో ఇండేన్ బుకింగ్ సిస్టమ్ క్రాష్ అయింది. మరి మీకు ఇండేన్ గ్యాస్ బుక్ అవుతోందా? COMMENT


