News August 3, 2024

మెదక్: మంచినీటి, మురుగునీటి వ్యవస్థలు ఏర్పాటు చేయండి: ఎంపీ

image

మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని తెల్లాపూర్ మున్సిపాలిటీలో మౌలిక వసతుల అభివృద్ధిపై తక్షణం దృష్టి సారించాలని ఎంపీ రఘునందన్ రావు కోరారు. శనివారం మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్‌ను కలిసి తెల్లా పూర్ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. హైదరాబాద్ వెస్ట్ జోన్‌లో నిరంతరం అభివృద్ధి చెందుతున్న ప్రధాన ప్రాంతంగా తెల్లాపూర్ ఉందని, వందలాది గేటెడ్ కమ్యూనిటీలతో ఈ ప్రాంతం ఉందన్నారు.

Similar News

News January 13, 2026

మెదక్: కౌన్సిలర్ అభ్యర్థుల్లో రిజర్వేషన్ టెన్షన్

image

మున్సిపల్ ఎన్నికల నగారా త్వరలో మోగనుండటంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఓటరు జాబితా విడుదల కావడంతో ఇప్పుడు అందరి దృష్టి రిజర్వేషన్లపైనే ఉంది. తమ వార్డు ఏ వర్గానికి కేటాయిస్తారోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు టికెట్ల కోసం పైరవీలు ముమ్మరం చేస్తూనే, వార్డుల్లో ప్రచారం మొదలుపెట్టారు. రిజర్వేషన్లు ఖరారైతేనే పోటీపై స్పష్టత రానుంది.

News January 13, 2026

మెదక్ జిల్లాలో మహిళలదే హవా !

image

మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మహిళా ఓటర్లు 45,168 మంది ఉండగా, పురుష ఓటర్లు 42,015 మంది ఉన్నారు. మెదక్ మున్సిపాలిటీలో 19,406, తూప్రాన్ 10,302, నర్సాపూర్ 8,656, రామాయంపేట 6,804 మహిళా ఓటర్లు ఉండగా, మెదక్ 17,548, తూప్రాన్ 9,957, నర్సాపూర్ 8,219, రామాయంపేట 6,291 మంది పురుష ఓటర్లు ఉన్నారు. మెదక్, నర్సాపూర్‌లో ఒక్కొక్క ఓటరు ఇతరులు ఉన్నారు.

News January 13, 2026

MDK: ఆపరేషన్ స్మైల్.. అమ్మనాన్న మీ దగ్గరికి వచ్చేశా!

image

రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1 నుంచి ప్రారంభమైన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా మెదక్ జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమష్టి కృషి జరుగుతోందని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. 10 రోజుల్లో 26 మంది బాలలను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించగా, 9 మందిని సంరక్షణ కేంద్రాలకు తరలించారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై 28 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.