News August 3, 2024

మెడల్ పక్కా చేసుకున్న అల్జీరియా బాక్సర్‌ ఖెలీఫ్‌

image

పారిస్: జెండర్‌పై వివాదంలో చిక్కుకున్న అల్జీరియా మహిళా బాక్సర్ ఇమానే ఖెలీఫ్ క్వార్టర్స్‌లో గెలుపొంది మెడల్ కన్ఫామ్ చేసుకున్నారు. హంగరీకి చెందిన హమోరీ లుకాపై 5-0 తేడాతో గెలుపొందారు. సెమీస్‌లో గెలిస్తే ఈమెకు గోల్డ్ లేదా సిల్వర్‌‌ దక్కుతుంది. ఒకవేళ ఓడినా కాంస్యం పక్కా. ఇటీవల ఇటలీ బాక్సర్‌ క్యారినీని 46 సెకన్లలో నాకౌట్ చేసిన తీరు వివాదాస్పదం కాగా ఆమె మహిళ కాదంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. <<-se>>#Olympics2024<<>>

Similar News

News March 24, 2026

సంచలనం.. యుద్ధంలోకి సౌదీ, UAE?

image

పశ్చిమాసియాలో యుద్ధం విస్తరించే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్‌పై అమెరికా చేస్తోన్న దాడుల్లో సౌదీ, UAE పాల్గొనేందుకు సిద్ధమైనట్లు ‘వాల్‌స్ట్రీట్ జనరల్’ వెల్లడించింది. తమ వైమానిక స్థావరాలను US వాడుకొనేందుకు సౌదీ ఓకే చెప్పినట్లు తెలిపింది. తమ దేశంలోని టెహ్రాన్‌కు చెందిన ఆస్పత్రి, క్లబ్‌ను UAE మూసేసినట్లు పేర్కొంది. తమ రిఫైనరీలపై ఇరాన్ దాడులను ఉపేక్షించబోమని ఇటీవల గల్ఫ్ దేశాలు ప్రకటించడం తెలిసిందే.

News March 24, 2026

సుప్రీం తీర్పు సరే.. క్రైస్తవంలో చేరారని నిరూపించేదెలా?

image

క్రైస్తవంలోకి మారిన వారు SC హక్కులు పొందలేరని సుప్రీంకోర్టు <<19462779>>తీర్పు<<>> ఇచ్చింది. అయితే బాప్టిజం సర్టిఫికెట్ లేకుండా క్రైస్తవాన్ని స్వీకరించినట్లు నిరూపించడం ఎలాగనేది అతిపెద్ద ప్రశ్న. ఎందుకంటే చర్చికి వెళ్లడం, పేర్లు మార్చుకోవడంతో మతం మారినట్లు చెప్పలేం. అలాంటి చట్టాలేవీ దేశంలో అమలులో లేవు. పలు రాష్ట్రాల్లో మత నిరోధక బిల్లులున్నా వాటి పాత్ర పరిమితం. ఈ అంశంపై విధివిధానాల రూపకల్పన అవసరం. ఏమంటారు?

News March 24, 2026

రన్‌టైమ్‌తో పనేంటి.. కథ బాగుంటే హిట్టే!

image

సినిమా సక్సెస్‌కు నిడివి ముఖ్యం కాదని, ప్రేక్షకులను కట్టిపడేసే కథే ప్రధానమని యానిమల్(3:24H), పుష్ప-2(3:21), ధురంధర్ 1&2(3:40& 3:51) చిత్రాలు నిరూపించాయి. బలమైన కథతో వస్తే జనాలు బ్రహ్మరథం పడతారని ఇవి స్పష్టం చేశాయి. రొటీన్ ఫార్ములాలు కాకుండా ఎమోషన్స్, ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లేతో వస్తే రన్‌టైమ్ అడ్డంకి కాదని తేలిపోయింది. కంటెంట్ బాగుంటే ఆడియన్స్‌ ఎన్ని గంటలైనా కూర్చుంటారనడానికి వీటి వసూళ్లే సాక్ష్యం.