News August 3, 2024

స్టార్లతో సంబంధం లేదు.. కంటెంటే కింగ్!

image

స్టార్లు, భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ఉన్న సినిమాలకు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. దానికే ఉదాహరణే కాంతార, హను-మాన్, మంజుమ్మల్ బాయ్స్. ప్రేక్షకులకు స్టోరీ కనెక్ట్ కాకపోతే స్టార్స్ ఉన్నా సరే, మంచి కలెక్షన్స్ రావట్లేదు(EX: ఇండియన్-2, సర్ఫిరా). ఒకవేళ స్టార్ల సినిమాల్లో కంటెంట్ కూడా బాగుంటే(EX: కల్కి) ఏకంగా ₹1000కోట్లకు పైగానే వసూళ్లు వస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? కామెంట్ చేయండి.

Similar News

News March 6, 2026

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో ఇవాళ భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేనివారికి శ్రీవారి దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. వేంకటేశ్వరుడి సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం 59,194 మంది శ్రీవారిని దర్శించుకోగా 25,295 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.87 కోట్లు వచ్చినట్లు TTD తెలిపింది.

News March 6, 2026

సూపర్ హీరో మూవీలో సల్మాన్ ఖాన్?

image

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సూపర్ హీరో కామెడీ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. దర్శక ద్వయం రాజ్ & DK ఆయనకు కథ చెప్పినట్లు సినీవర్గాలు తెలిపాయి. సల్మాన్‌కు స్టోరీ నచ్చిందని, కానీ భారీ బడ్జెట్ వద్దని దర్శకులకు చెప్పారని పేర్కొన్నాయి. రిటైర్ అవ్వాలనుకున్న ప్రతిసారి సమస్యలు ఎదురై యాక్షన్‌లోకి దిగే సూపర్ హీరో పాత్రలో కనిపిస్తారని చెప్పాయి. హాలీవుడ్ మూవీ ‘హాంకాక్’ తరహాలో కథ ఉండొచ్చని వివరించాయి.

News March 6, 2026

ఇక మారవా బ్రో..!

image

నిన్న టీ20 వరల్డ్ కప్‌ సెమీస్‌లో ఇంగ్లండ్‌పై భారత్ గెలిచినా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. 9 పరుగుల వద్ద మరోసారి చెత్త షాట్‌తో వికెట్ పారేసుకున్నారు. దీంతో ఈ టోర్నీలో పేలవ ప్రదర్శన కంటిన్యూ చేస్తున్నారు. మాజీలు సైతం నిలకడగా ఆడాలని చెబుతున్నా అభి ఆటతీరు మారడం లేదు. ఇక టోర్నీలో మిగిలింది ఫైనల్ మాత్రమే. మరి అందులోనైనా రాణించి భారత్‌కు కప్పు అందిస్తారో లేదో చూడాలి.