News August 3, 2024
నాంపల్లి: 30% రైతులకు మాత్రమే రుణమాఫీ: కొండపల్లి శ్రీధర్

రైతు రుణమాఫీ విషయంలో వేలాది మంది రైతులకు అన్యాయం జరిగిందని బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ అన్నారు. బీజేపీ కార్యాలయంలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని, వేలాది మంది రైతులు తమకు కాల్ చేస్తున్నారన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంక్షలతో 30% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయిందన్నారు. మిగతావారు వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ఈ నెల 5నుంచి గ్రామాల వారిగా ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు.
Similar News
News March 12, 2026
HYD: బస్తీ గర్భిణులకు ‘ఏఐ’ భరోసా

HHF-విప్రో సహకారంతో అర్బన్ స్లమ్స్‌లో ఆనందిమా కిట్ల ద్వారా ఉచిత వైద్య పరీక్షలు షురూ అయ్యాయి. ఈ స్మార్ట్ AI కిట్‌తో BP, షుగర్, హిమోగ్లోబిన్ పరీక్షలతో పాటు కడుపులోని బిడ్డ గుండె చప్పుడునూ నిమిషాల్లో తెలుసుకోవచ్చు. ఏవైనా తేడాలుంటే AI హెచ్చరిస్తుంది. ‘కేర్ మదర్’ యాప్ ద్వారా హైరిస్క్ కేసులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ తల్లీబిడ్డల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్నారు. గర్భిణుల పాలిట AI వరంగా నలిచింది.
News March 12, 2026
HYD: బస్తీ గర్భిణులకు ‘ఏఐ’ భరోసా

హెచ్‌హెచ్‌ఎఫ్-విప్రో సహకారంతో అర్బన్ స్లమ్స్‌లో ‘ఆనందిమా’ కిట్ల ద్వారా ఉచిత వైద్య పరీక్షలు షురూ అయ్యాయి. ఈ స్మార్ట్ ఏఐ కిట్‌తో బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ వంటి పరీక్షలతో పాటు కడుపులోని బిడ్డ గుండె చప్పుడును కూడా నిమిషాల్లో తెలుసుకోవచ్చు. ఏవైనా తేడాలుంటే AI వెంటనే హెచ్చరిస్తుంది. ‘కేర్ మదర్’ యాప్ ద్వారా హైరిస్క్ కేసులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ తల్లీబిడ్డల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్నారు.
News March 11, 2026
జీహెచ్‌ఎంసీ చట్టానికి మంగళం.. HYDలో కొత్త చట్టం!

GHMCని మూడు కార్పొరేషన్లుగా విభజించడమే కాకుండా, పాత ‘GHMC యాక్ట్-1955’ స్థానంలో కొత్తగా Core Urban Act తీసుకురావడానికి ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే భవన నిర్మాణాల నుంచి రోడ్ల నిర్వహణ వరకు అంతా కేంద్రీకృత పద్ధతిలో సాగుతుంది. స్థానిక కార్పొరేషన్ల అధికారాలను కుదించి, నేరుగా రాష్ట్ర ప్రభుత్వం (MAUD శాఖ) చేతుల్లోకి పాలనను తెచ్చుకోవడమేనని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.


