News August 4, 2024
NRML: ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ సదస్సులో పాల్గొన్న ఆర్జీయూకేటీ వీసీ

హైద్రాబాద్‌లో FCCI ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ కార్యక్రమానికి యూజీసీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం.జగదీష్ కుమార్ ఆహ్వానం మేరకు బాసర ఆర్జీయూకేటీ వీసీ వెంకటరమణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్తంగా తెలంగాణలో ఉన్నత విద్యకు సంబంధించిన పత్రాన్ని విడుదల చేశారు. వెంకటరమణ మాట్లాడుతూ.. ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ సాధికారత జరగాలంటే విద్యార్థి-కేంద్రీకృత అభ్యాసం పై దృష్టి పెట్టాలన్నారు.
Similar News
News March 18, 2026
ADB: గ్రామాలను గంజాయి రహితంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

సర్పంచులు, కౌన్సిలర్లు తమ పరిధిలోని గ్రామాలను, వార్డులను గంజాయి రహితంగా మార్చాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. యువత డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు ‘మూడవ కన్ను’లా పనిచేస్తాయని, ప్రతి ఒక్కరూ వీటి ఏర్పాటుపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమాజ శ్రేయస్సు కోసం అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
News March 18, 2026
ADB: ఖోడద్ అభివృద్ధికి ఉద్యోగుల కృషి భేష్- కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఖోడద్ గ్రామ అభివృద్ధికి ఆ గ్రామానికి చెందిన ఉద్యోగులు చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా కొనియాడారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. సొంత ప్రాంతంపై మమకారంతో విజ్ఞానాన్ని పంచేందుకు లైబ్రరీని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ పేర్కొన్నారు.