News August 4, 2024

శుభ ముహూర్తం

image

✒ తేది: ఆగస్టు 4, ఆదివారం
✒ అమావాస్య: సాయంత్రం 4.42 గంటలకు
✒ పుష్యమి: మధ్యాహ్నం 1.26 గంటలకు
✒ వర్జ్యం: తెల్లవారుజాము 3.15 నుంచి 4.59 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: సాయంత్రం 4.54 నుంచి 5.45 గంటల వరకు

Similar News

News March 20, 2026

స్టాక్ మార్కెట్లకు జోష్.. రూపాయి డౌన్

image

నిన్నటి భారీ నష్టాల నుంచి ఈరోజు స్టాక్ మార్కెట్లు కోలుకొని లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. సెన్సెక్స్ 325 పాయింట్ల లాభంతో 74,532 వద్ద, నిఫ్టీ 112 పాయింట్లు ఎగిసి 23,114 వద్ద సెటిల్ అయ్యాయి. క్రూడ్ టెన్షన్స్ తగ్గడం, కొనుగోళ్లు పెరగడం వంటివి మార్కెట్లలో జోష్ నింపాయి. రూపాయి మాత్రం ఒక డాలరుకు ₹93 మార్క్ దాటి జీవితకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. FII విక్రయాలు, డాలర్ డామినేషన్, యుద్ధం ఇందుకు కారణాలు.

News March 20, 2026

కల్తీ జరిగితే ఈ నంబర్‌కు కాల్ చేయండి

image

TG: హైదరాబాద్‌లో ఆహార కల్తీ నియంత్రణకు పోలీసులు ‘హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్’ను ఏర్పాటు చేశారు. ఇందులో సీఐలు, ఎస్సైలు, ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 28 మంది సభ్యులు ఉంటారు. కల్తీకి పాల్పడే వారిని గుర్తించడం, నిఘా ఉంచడం, దాడులు నిర్వహించడం, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం వీరి బాధ్యత. ఎక్కడైనా కల్తీ జరిగితే టోల్ ఫ్రీ నంబర్ 87126 61212కి కాల్ చేయాలని ప్రజలకు సూచించారు.

News March 20, 2026

అమెరికాకు షాక్.. కుప్పకూలిన 16 యుద్ధ విమానాలు

image

ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటి వరకు 16 యుద్ధ విమానాలను కోల్పోయినట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. వీటిలో పది MQ-9 రీపర్ డ్రోన్లు, మూడు F-15లు, రీఫ్యూయలింగ్ విమానం KC-135 ఉన్నాయని తెలిపింది. అలాగే సౌదీలోని ఓ అమెరికన్ వైమానిక స్థావరంలోని ఐదు KC-135లు డ్యామేజ్ అయ్యాయంది. వీటిలో కొన్ని ఇరాన్ కూల్చగా, మరికొన్ని ఫ్రెండ్లీ ఫైర్‌లో దాడికి గురయ్యాయని పేర్కొంది.